ఎన్టీఆర్‌ ‘అరవింద సమేత’కు మళ్లీ లీక్‌ ల దెబ్బ  

  • మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత’. ఈ చిత్రం ప్రారంభం అయినప్పటి నుండి ఏదో ఒకటి లీక్‌ అవుతూనే వస్తుంది. ఆమద్య ఎన్టీఆర్‌కు సంబంధించిన లుక్‌ లీక్‌ అవ్వడంతో షాక్‌ అయిన చిత్ర యూనిట్‌ సభ్యులు ఆ తర్వాత ఎన్టీఆర్‌ మరియు నాగబాబు కలిసి ఉన్న లుక్‌ లీక్‌ అవ్వడంతో జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించారు. షూటింగ్‌ స్పాట్‌కు కనీసం మొబైల్స్‌ కూడా తీసుకు రావద్దని హెచ్చరించారు.

  • Aravinda Sametha Movie Gets Leaked In Social Media-

    Aravinda Sametha Movie Gets Leaked In Social Media

  • త్రివిక్రమ్‌ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా లీక్‌ అవుతూనే వస్తున్నాయి. ఆమద్య ఒక పాట లీక్‌ అయినట్లుగా ప్రచారం జరిగింది. తాజాగా ‘అరవింద సమేత’ చిత్రంకు సంబంధించిన యాక్షన్‌ సీన్స్‌ లీక్‌ అవ్వడం జరిగింది. ఈ యాక్షన్‌ సీన్స్‌లో ఎన్టీఆర్‌తో పాటు కమెడియన్‌ సునీల్‌ కూడా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కీలకమైన యాక్షన్‌ సీన్స్‌ లీక్‌ అవ్వడంతో చిత్ర యూనిట్‌ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే లీక్‌ అయిన ఆ సీన్స్‌ను సోషల్‌ మీడియాలో లేకుండా చేసే ప్రయత్నం చేశారు.

  • Aravinda Sametha Movie Gets Leaked In Social Media-
  • లీక్‌ అయిన యాక్షన్‌ సీన్స్‌ సోషల్‌ మీడియాలో సర్క్యులేట్‌ కాకుండా జాగ్రత్త పడుతున్న చిత్ర యూనిట్‌ సభ్యులు మరో వైపు ఆ సీన్‌ లీక్‌కు కారణం ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు కూడా చేయాలని భావిస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. మరో వైపు చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం విదేశాల్లో పాట చిత్రీకరణతో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.
    పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు మరియు జగపతిబాబులు కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి సారి ఎన్టీఆర్‌ రాయలసీమ యాసలో ఈ చిత్రంలో మాట్లాడబోతున్నట్లుగా కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి అరవింద సమేత చిత్రం విడుదల ముందు అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. మరి ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్ని దక్కించుకుంటుందో చూడాలి.