అరవింద సమేత కలెక్షన్స్‌.. ఫ్యాన్స్‌ కోరిక తీరేనా?  

Aravinda Sametha Movie Collections Towards 200cr-

ఎన్టీఆర్‌, పూజా హెగ్డే జంటగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కి నాలుగు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘అరవింద సమేత’ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో నాన్‌ బాహుబలి రికార్డును సొంతం చేసుకున్న ఈ చిత్రం ముందు ముందు మరిన్ని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మొదటి వారాంతంలోనే వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఈ చిత్రం నిలిచింది..

అరవింద సమేత కలెక్షన్స్‌.. ఫ్యాన్స్‌ కోరిక తీరేనా?-Aravinda Sametha Movie Collections Towards 200cr

కేవలం ఇద్దరు మగ్గురు మాత్రమే ఉన్న ఈ జాబితాలో ఎన్టీఆర్‌ చేరిపోయాడు.

మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్‌ను వస్లూు చేస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్‌ నటించిన చిత్రాల్లో ఏది కూడా ఆ స్థాయి వసూళ్లను సాధించింది లేదు. అందుకే ఈ చిత్రం 200 కోట్ల గ్రాస్‌ను వసూళ్లు చేస్తే నందమూరి ఫ్యాన్స్‌ కాలర్‌ ఎగరేసుకోవచ్చని ఆశపడుతున్నారు. త్రివిక్రమ్‌ ఈ చిత్రంను అద్బుతంగా తెరకెక్కించి తన మార్క్‌విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

నందమూరి ఫ్యాన్స్‌ కోరుకుంటున్న 200 కోట్ల వసూళ్లు సాధ్యం అయ్యేనా అంటూ ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. త్వరలో రామ్‌ హీరోగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘హలో గురూ ప్రేమకోసమే’ చిత్రం విడుదల కాబోతుంది. ఆ చిత్రం వచ్చే వరకు అరవింద సమేత జోరు కొనసాగబోతుంది. ఒక వేళ ఆ సినిమాకు సూపర్‌ హిట్‌ సినిమా అంటూ టాక్‌ వస్తే అప్పుడు ప్రభావం పడే అవకాశం ఉంది..

అరవింద సమేతకు రామ్‌ సినిమా ప్రభావం పడితే ఖచ్చితంగా 200 కోట్లను వసూళ్లు చేయలేక పోవచ్చు అంటున్నారు. అయితే రామ్‌ గత సినిమాల ఫలితాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఈ చిత్రం కూడా అంతం మాత్రమే అంటూ టాక్‌ వినిపిస్తుంది. అరవింద సమేత లాంగ్‌ రన్‌ కలెక్షన్స్‌ ఎంత అనే ఊహాగాణాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి.