అరవింద ప్రదర్శణ అడ్డుకుంటాం  

Aravinda Sametha Controversy In Social Media-

ఎన్టీఆర్‌ హీరోగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో చాలా కాలంగా ఎదురు చూస్తున్న చిత్రం ఎట్టకేలకు ‘అరవింద సమేత’ చిత్రం రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ను దక్కించుకున్న ఈ చిత్రం కేవలం మొదటి నాలుగు రోజుల్లో 100 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి 200 కోట్ల వైపుకు దూసుకు పోతుంది. ఇలాంటి సమయంలో ఈ చిత్రం వివాదంలో చిక్కుకుంది. ఈ చిత్రంపై రాయలసీమ విద్యార్థి సంఘాలు మరియు ప్రజా సంఘాలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ సినిమాను అడ్డుకుంటాం అంటూ హెచ్చరించడం జరిగింది.

Aravinda Sametha Controversy In Social Media-

Aravinda Sametha Controversy In Social Media

‘అరవింద సమేత’ చిత్రంలో ఫ్యాక్షనిజంను మరో మెట్టు పైకి ఎక్కించి, అద్బుతంగా చిత్రీకరించారంటూ ప్రచారం జరుగుతుంది. ఎన్టీఆర్‌లో కొత్తగా ఫ్యాక్షనిస్ట్‌ను చూపించడంతో త్రివిక్రమ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు సీమ సినిమాలంటే తొడ కొట్టడం చూపించారు. కాని ఎన్టీఆర్‌ ఈ చిత్రంలో కత్తితో తొడ కొట్టడం సంచలనంగా మారింది. ఈ సినిమాలో సీమలోని రెడ్డి వాళ్లంతా కూడా ఫ్యాక్షనిస్టులుగా చూపించే ప్రయత్నం చేశారు. రెడ్డి సామాజిక వర్గంకు చెందిన రాయలసీమ వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఈ చిత్రం ఉందంటూ ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Aravinda Sametha Controversy In Social Media-

తాజాగా మీడియా ముందుకు వచ్చిన సీమ స్టూడెంట్‌ లీడర్స్‌ మరియు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ అరవింద సమేత చిత్రంలో రాయలసీమను అవమానిస్తూ పలు సీన్స్‌ ఉన్నాయి. ఆ సీన్స్‌ను వెంటనే సినిమా నుండి తొలగించాలి, మాతో చర్చించి ఆ సీన్స్‌పై మాకు క్లారిటీ ఇవ్వాలి. మేము చెప్పిన సీన్స్‌ను తొలగించి ఆ తర్వాత సినిమాను ప్రదర్శించాలని, లేదంటే రాయలసీమ మొత్తం సినిమా ప్రదర్శణన అడ్డుకుంటామని, పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్దమవుతామని చెప్పుకొచ్చారు.