ఆచార్యలో విలన్ గా అరవింద్ స్వామికే పట్టం  

Aravind Swamy Main Villon In Acharya Movie, Tollywood, Telugu Cinema, South Cinema, Megastar chiranjeevi, Ram Charan, Koratala Siva, Sonu Sood - Telugu Acharya Movie, Aravind Swamy, Koratala Siva, Megastar Chiranjeevi, Ram Charan, Sonu Sood, South Cinema, Telugu Cinema, Tollywood

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది.

TeluguStop.com - Aravind Swamy Main Villon In Acharya Movie

లాక్ డౌన్ కంటే ముందుగానే షూటింగ్ ప్రారంభమైన కరోనా ఎఫెక్ట్ కారణంగా సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది.ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా షూటింగ్ లో పాల్గొనడానికి రెడీ అయ్యాడు.

భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ సినిమా కంటెంట్ ఎలివేట్ చేసే విధంగా ఉంది.

TeluguStop.com - ఆచార్యలో విలన్ గా అరవింద్ స్వామికే పట్టం-General-Telugu-Telugu Tollywood Photo Image

అపజయం అంటూ లేకుండా వెళ్తున్న కొరటాల కెరియర్ లో ఈ సినిమా ద్వారా మరో హిట్ పడటం పక్కా అనే మాట వినిపిస్తుంది.ఇక ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా తనయుడు రామ్ చరణ్ కూడా నటిస్తూ ఉండటంతో ఈ సినిమా మల్టీ స్టారర్ గా మారిపోయింది.

తండ్రి, కొడుకుల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది.

దానికి తగ్గట్లే బాలీవుడ్ నటుడుని ఇందులో విలన్ గా తీసుకోవాలని కొరటాల ప్లాన్ చేశాడు.అయితే అది వర్క్ అవుట్ కానట్లు ఉంది.ఇక ఇందులో సోనూసూద్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.మెయిన్ విలన్ పాత్ర కోసం మాత్రం ధృవ సినిమాతో స్టైలిష్ విలన్ గా అందరిని మెప్పించిన అరవింద్ స్వామిని ఈ సినిమాలో విలన్ గా ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.

ఈ విషయాన్ని త్వరలో అధికారికంగా కన్ఫర్మ్ చేయనున్నట్లు సమాచారం.అలాగే ఈ షెడ్యుల్ షూటింగ్ లో వచ్చే నెల నుంచి అతను కూడా భాగం అవుతాడని తెలుస్తుంది.

అరవింద్ స్వామి ఈ సినిమాలో విలన్ గా నటిస్తే సినిమాకి ఆ రకంగా కూడా కొంత హైప్ వస్తుంది.

#Ram Charan #Aravind Swamy #Sonu Sood #Koratala Siva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Aravind Swamy Main Villon In Acharya Movie Related Telugu News,Photos/Pics,Images..