అరవింద్ స్వామి కూతురు ఫోటోను ఎప్పుడైనా చూశారా..?  

aravind swamy daughter photo goes viral in social media, adhira swamy, talaivi, career, dhruva, villain role, hero role - Telugu Adhira Swamy, Aravind Swamy Daughter, Photo Goes Viral, Social Media

కెరీర్ మొదట్లో హీరో పాత్రల్లో ఎక్కువగా నటించి ప్రస్తుతం విలన్ పాత్రల్లోనూ నటిస్తూ మెప్పిస్తున్నారు అరవింద్ స్వామి.మణిరత్నం డైరెక్షన్ లో అరవింద్ స్వామి హీరోగా తెరకెక్కిన సినిమాలు అతనికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.

TeluguStop.com - Aravind Swamy Daughter Photo Goes Viral In Social Media

చెన్నైకు చెందిన అరవింద్ స్వామి అమెరికాలోని ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ లో మాస్టర్ డిగ్రీ చేశారు.బాల్యంలో డాక్టర్ కావాలనుకున్న అరవింద్ స్వామి పాకెట్ మనీ కోసం కొన్ని యాడ్స్ లో నటించారు.

ఆ ప్రకటనలు మణిరత్నం దృష్టిలో పడటం అరవింద్ స్వామి సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి.తెలుగులో రామ్ చరణ్ హీరోగా నటించిన ధృవ సినిమాలోని పాత్ర ద్వారా ఈ స్టైలిష్ విలన్ గుర్తింపు తెచ్చుకున్నారు.

TeluguStop.com - అరవింద్ స్వామి కూతురు ఫోటోను ఎప్పుడైనా చూశారా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే విలన్ గా వరుస ఆఫర్లు వస్తున్నా తనకు గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రల్లో మాత్రమే అరవింద్ స్వామి నటిస్తున్నారు.ఒకవైపు సినిమాల్లో నటిస్తున్న అరవింద్ స్వామి మరోవైపు వ్యాపారాలతో కూడా బిజీగా ఉన్నారు.

సోషల్ మీడియాలో కూడా అరవింద్ స్వామి యాక్టివ్ గా ఉంటారు.తాజాగా అరవింద్ స్వామి కూతురుతో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.సోషల్ మీడియాలో ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.అరవింద్ స్వామి కూతురు ఫోటోను చూసిన నెటిజన్లు ఆయనకు ఇంట పెద్ద కూతురు ఉందా.? అని ఆశ్చర్యపోతున్నారు.అరవింద్ స్వామి కూతురు పేరు అధిరా స్వామి.

జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అరవింద్ స్వామి తన కూతురుతో సైకిల్ పై దిగిన ఫోటోను షేర్ చేశారు.

భవిష్యత్తులో అరవింద్ స్వామి కూతురు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారేమో చూడాల్సి ఉంది.

ప్రస్తుతం అరవింద్ స్వామి తమిళంలో తలైవి సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.కంగనా రనౌత్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

#AravindSwamy #Adhira Swamy #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు