అరణ్య ఓ రియల్ స్టోరీ అంటోన్న రానా  

Aranya Is Based On True Story Says Rana - Telugu Aranya, Jadhav Payeng, Prabhu Solomon, Rana Daggubati, Telugu Movie News

బాహుబలి స్టార్ రానా దగ్గుబాటి నటిస్తున్న తాజా చిత్రం అరణ్య ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానా ఓ విభిన్నమైన పాత్రలో నటిస్తున్నాడు.

Aranya Is Based On True Story Says Rana - Telugu Jadhav Payeng Prabhu Solomon Daggubati Movie News

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను అలరించగా, ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలు పెచింది.

ప్రభు సోలోమాన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రానా పోషిస్తున్నా పాత్ర నిజజీవితంలో ఉన్న పాత్రే అని ఆయన తెలిపారు.

ఈ సినిమాలో తన పాత్ర గిరిజన రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జాదవ్ పయెంగ్‌ను పోలి ఉంటుందని రానా తెలిపాడు.తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించి పలు అంశాలను ప్రస్తావించాడు.

పర్యావరణాన్ని కాపాడే వ్యక్తిగా, సాంకేతికతకు దూరంగా ఉన్న వ్యక్తిగా తాను ఈ సినిమాలో నటించానని చెప్పుకొచ్చాడు.

అస్సాంకు చెందిన జాదవ్ పయెంగ్ 1,300 ఎకరాల బంజరు భూమిని పచ్చని చెట్లతో అరణ్యంగా మార్చినందుకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించింది.

మరి ఈ సినిమాలో రానా నటించిన పాత్ర ఆయనను ఎంతమేర పోలి ఉంటుందో తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ ప్రేమికులు.

తాజా వార్తలు

Aranya Is Based On True Story Says Rana-jadhav Payeng,prabhu Solomon,rana Daggubati,telugu Movie News Related....