ఏఆర్‌ రెహమాన్‌ కు కోర్టు నోటీసులు

ఆస్కార్‌ విన్నింగ్‌ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ పై హైకోర్టులో ఐటీ అధికారులు పిటీషన్‌ వేయడం జరిగింది.మద్రాస్‌ హైకోర్టు ఆ విషయంపై రెహమాన్‌ కు నోటీసులు కూడా పంపించడం జరిగింది.

 Madras Court Issues Notice To Ar Rahman, Ar Rehaman, High Court, It Officers, In-TeluguStop.com

దాదాపు 8 సంవత్సరాలుగా ఒక లావాదేవి విషయంలో రెహమాన్‌ ట్యాక్స్‌ చెల్లించకుండా ఎగవేస్తున్నాడు అంటూ కోర్టులో అధికారులు పిటీషన్‌ వేయడం జరిగింది.దాంతో కోర్టు ఆయనకు నోటీసులు పంపించింది.

కోర్టు నోటీసులకు ఆయన వారం నుండి పది రోజుల్లో సమాధానం చెప్పాల్సి ఉంటుంది.ఒక వేళ ఆయన సమాధానం చెప్పకుంటే కోర్టు దిక్కార కేసును నమోదు చేసే అవకాశం ఉంది అంటున్నారు.

భారీ ఎత్తను ట్యాక్స్‌ చెల్లించే సెలబ్రెటీల్లో ఒక్కరు అయిన రెహమాన్‌ విషయంలో ఇలాంటి ఆరోపణలు రావడం చర్చనీయాంశం అయ్యింది.

అసలు విషయంలోకి వెళ్తే 2012 సంవత్సరంలో బ్రిటన్‌ కు చెందిన ఒక సంస్థతో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయల ఒప్పందంను రెహమాన్‌ చేసుకున్నాడు.

కాని ఇప్పటి వరకు ఆ ఒప్పందంకు సంబంధించిన ట్యాక్స్‌ ను రెహమాన్‌ చెల్లించలేదు.అప్పటి నుండి ట్యాక్స్‌ అధికారులు ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించినా కూడా ఆయన నుండి స్పందన లేదు.

ఆయన సరైన సమాధానం చెప్పక పోవడంతో పాటు పన్ను ఎగవేతకు ప్రయత్నిస్తున్నట్లుగా అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.

మరి కోర్టుకు రెహమాన్‌ ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నాడు అనే విషయంలో ఆసక్తి నెలకొంది.

దేశం నుండి సంగీత దర్శకుడిగా ఆస్కార్‌ దక్కించుకున్న మొదటి సంగీత దర్శకుడు రెహమాన్‌.అలాంటి వ్యక్తిని ఇలా వేధించడం ఏం బాగాలేదు అంటూ ఐటీ అధికారులను నెటిజన్స్‌ విమర్శిస్తున్నారు.మరికొందరు మాత్రం రెహమాన్‌ పై నే ట్రోల్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube