రహమాన్‌ '99 సాంగ్స్‌' ను ఎవరు పట్టించుకుంటారు?

సౌత్‌ నుండి సంగీత దర్శకుడిగా ఉత్తరాదికి వెళ్లి అక్కడ నుండి ఏకంగా హాలీవుడ్‌ లోకి కూడా వెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్‌ రహమాన్‌.ఈయన ప్రస్తుతం నిర్మాతగా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నాడు.

 Ar Ramaham Producer 99 Songs Movie Release-TeluguStop.com

ఆస్కార్‌ అవార్డు గ్రహీత అయిన రహమాన్‌ స్క్రిప్ట్‌ అందించి మరియు నిర్మించిన ‘99 సాంగ్స్‌’ సినిమా విడుదలకు సిద్దం అవుతోంది.హిందీ లో రూపొందిన ఈ సినిమా ను తెలుగు మరియు తమిళం లో కూడా డబ్బింగ్‌ చేసి విడుదల చేయబోతున్నారు.

ఈ వారంలో మూడు భాషల్లో ఒకే సారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు సాదా సీదాగానే ఉన్నాయి.ఈ సినిమా పెద్దగా అంచనాల నడుమ విడుదల అవ్వడం లేదు.తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ సినిమా విడుదల పై జనాల్లో ఆసక్తి ఉన్నట్లుగా కనిపించడం లేదు.

 Ar Ramaham Producer 99 Songs Movie Release-రహమాన్‌ ’99 సాంగ్స్‌’ ను ఎవరు పట్టించుకుంటారు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

99 సాంగ్స్‌ సినిమా ను సరైన సమయంలో తీసుకు రావడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు విమర్శలు చేస్తున్నారు.సినిమా కు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నా కూడా ఇంకా జనాల్లోకి మాత్రం ఈ సినిమా చొచ్చుకు వెళ్లినట్లుగా అనిపించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కనుక ఈ సినిమా కనీసం ఓపెనింగ్స్ అయినా రాబడుతుందా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హిందీలో కాస్త ఓపెనింగ్స్‌ విషయంలో పాజిటివిటీ కనిపించే అవకాశం ఉంది.కాని సినిమా కు పాజిటివ్‌ టాక్‌ వస్తేనే మినిమం వసూళ్లు నమోదు అవుతాయని అంటున్నారు.ఒక వైపు కరోనా కారణంగా అనధికారిక లాక్‌ డౌన్‌ లు అమలు అవుతున్న ఈ సమయంలో రహమాన్‌ ఈ సినిమా ను విడుదల చేసి సాహసం చేస్తున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

#99 Songs #Ar Rahaman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు