ఏ.ఆర్.రెహమాన్ 99 సాంగ్స్ ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో మెప్పిస్తుంది

ఇండియన్ నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి ఏ.ఆర్.

 Ar Rahman's 99 Songs Release On Netflix, Kollywood, Bollywood, Digital Ott,lates-TeluguStop.com

రెహమాన్.అలాగే ఇండియా నుంచి ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులు అందుకున్న ఎకైనా సెలబ్రిటీగా కూడా కూడా రెహమాన్ ఇమేజ్ వరల్డ్ వైడ్ గా ఉంది.

హాలీవుడ్ సినిమాలకి సైతం రెహమాన్ సంగీతం అందిస్తూ ఉన్నాడంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు.ఇదిలా ఉంటే ఇక రెహమాన్ నిర్మాతగా మారి తానే కథ, స్క్రీన్ ప్లే అందించి 99 సాంగ్స్ అనే రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టొరీని తెరకెక్కించారు.

ఈ మూవీని థియేటర్ లో రిలీజ్ చేద్దామని అనుకున్నా కూడా కరోనా లాక్ డౌన్, సెకండ్ వేవ్ ప్రభావంతో వాయిదా వేసేశారు.గత ఏడాదిలోనే పూర్తయిన ఈ మూవీని ఫైనల్ గా నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేశారు.

అయితే సినిమాకి రెహమాన్ పెద్దగా ప్రమోషన్ చేయలేదు.దీంతో రిలీజ్ అవుతున్న విషయం కూడా ఎవరికి తెలియలేదు.

లాక్ డౌన్ ప్రభావంతో అందరూ ఇంటిపట్టునే ఉండటంతో డిజిటల్ ఆడియన్స్ ఇప్పటికే ఒటీటీ ఛానల్స్ లో రిలీజ్ అయిన సినిమాలని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ నేపధ్యంలో రెహమాన్ 99 సాంగ్స్ నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కావడంతో దీనిపై కూడా ఆసక్తి పెరిగింది.

ఈ సినిమాలో జయ్ అనే పాత్రలో హీరో ఇహన్ భట్ సోఫియా పాత్రలో ఎడిల్సి వర్గాస్ కనిపించనున్నారు.మ్యూజిక్ డైరెక్టర్ కావాలనుకునే కుర్రాడి ప్రేమ ప్రయాణంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఉంటుంది.

ఇక ఈ సినిమాకు విశ్వేష్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించాడు.ప్రస్తుతానికి అయితే ఈ మూవీకి స్పందన బాగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube