అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న సినిమా లవ్ స్టోరీ.ఈ సినిమాకు పవన్ మ్యూజిక్ డైరక్టర్ గా చేశారు.సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా విజయ్ సి కుమార్ పనిచేశారు.ఆయన తనయుడే పవన్ సి.హెచ్.అంతేకాదు పవన్ అకాడెమీ అవార్డ్ విన్నర్ ఇండియాస్ గ్రేటెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ ఏ.ఆర్.రెహామన్ కు శిష్యుడు కూడా.తన శిష్యుడు తొలిసారిగా మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం అవుతున్న సందర్భంగా లవ్ స్టోరీ రిలీజ్ టైం లో ఆ సినిమాకు.పవన్ కు తన విషెస్ అందించాడు రెహమాన్.
ఈ సందర్భంగా రెహమాన్ ఒక వీడియో మెసేజ్ అందించారు.
నీలో చాలా ప్రతిభ ఉంది పవన్.
నువ్వు సక్సెస్ తో పాటు ప్రజాభిమానం పొందాలని ఆశిస్తున్నా.నాగ చైతన్య, సాయి పల్లవి, శేఖర్ కమ్ముల అందరికి గుడ్ లక్ అని అన్నారు రెహమాన్.
లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి, ఆమీర్ ఖాన్ స్పెషల్ గెస్టులుగా వచ్చిన విషయం తెలిసిందే.ఇక సినిమాలోని సారంగ దరియా సాంగ్ ఇప్పటికే 324 మిలియన్ల వ్యూస్ రాబట్టింది.
సెప్టెంబర్ 24న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు ఆడియెన్స్ లో పాజిటివ్ బజ్ ఉంది.సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.