నాని సినిమాకు ఆస్కార్ విజేత వాయింపుడు!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వి చిత్రాన్ని తెరకెక్కిస్తూ బిజీగా ఉన్నాడు.ఈ సినిమాను వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చూస్తున్న నాని, టక్ జగదీష్‌ అనే మరో సినిమాను కూడా లైన్‌లో పెట్టాడు.

 Ar Rahman To Give Music For Nani-TeluguStop.com

ఈ రెండు సినిమాలు ఇంకా రిలీజ్ కాకముందే ముచ్చటగా మూడో సినిమాను కూడా లైన్‌లో పెట్టేశాడు.విజయ్ దేవరకొండతో టాక్సీవాలా సినిమాను తెరకెక్కించిన రాహుల్ సంకిర్త్యన్ డైరెక్షన్‌లో నాని తన నెక్ట్స్ మూవీని చేయనున్నాడు.

అయితే ఈ సినిమాకు శ్యాం సింగ రాయ్ అనే టైటిల్‌ను ఇటీవల రివీల్ చేశారు చిత్ర యూనిట్.భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతాన్ని ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్‌ అందించనున్నట్లు తెలుస్తోంది.

పూర్తి పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం పర్ఫెక్ట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తున్నారు.అయితే స్ట్రెయిట్ తెలుగు మూవీకి రెహమాన్ సంగీతం ఇచ్చి చాలా ఏళ్లు అవుతోంది.

మరి ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా రెహమాన్ సంగీతం ఇవ్వగలడా? అసలు రెహమాన్ ఈ తెలుగు చిత్రానికి సంగీతం ఇచ్చేందుకు ఒప్పుకుంటాడా లేడా? అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.ఈ అంశాలకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు ఆగాల్సిందే అంటున్నారు సినీ ప్రేక్షకులు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube