విభేదాలు మాని సేవ చెయ్యండంటున్న ఆస్కార్ విజేత...

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రజలు కరోనా మంత్రం జపిస్తున్నారు.ఈ కరోనా వైరస్ కారణంగా దేశంలో పలు సంస్థలు తాత్కాలికంగా మూసివేయబడ్డాయి.

 Ar Rahman, Music Director, Ar Rahman Tweet, Ar Rahman Face Book Post-TeluguStop.com

అంతేగాక ప్రజలకు అత్యవసర సదుపాయాలను తప్ప మిగిలిన అన్ని సదుపాయాలు ప్రభుత్వ శాఖలతో పాటూ ప్రయివేట్ శాఖలు కూడా మూసి వేసాయి.అయితే తాజాగా భారతదేశంలో ఢిల్లీ నగరంలో జరిగినటువంటి మర్కజ్ ప్రవచనాలకు వెళ్లినటువంటి ప్రజలను కనిపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

అయితే తాజాగా ఈ విషయంపై ఆస్కార్ అవార్డు విజేత మరియు భారతదేశపు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందించారు.ఇందులో భాగంగా దేశంలో కులమత భేదాలను పట్టించుకోకుండా అందరికీ వైద్యం అందిస్తున్నటువంటి డాక్టర్లు మరియు ఆస్పత్రిలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపాడు.

అలాగే ఆందోళన పరిస్థితులు సృష్టించే సమయం ఇది కాదని కాబట్టి కరోనా వైరస్ గురించి ఎటువంటి అనుమానాలు ఉన్నా వెంటనే దగ్గరలో ఉన్నటువంటి వైద్యులను సంప్రదించాలని సూచించారు.అంతేగాక కొంతకాలం పాటు స్వీయ నిర్బంధం పాటిస్తే మరింతకాలం బ్రతకవచ్చని కూడా తెలిపారు.

ఇలా చేయడం వల్ల తోటి ప్రజలకు కూడా హాని కలగదని సూచించారు.

అలాగే దేవుడు మన పవిత్రమైన హృదయం లోనే ఉంటాడని ఈ సమయంలో మతపరమైన విభేదాలు సృష్టించడం మానేసి ప్రజలకు సేవ చేయాలని సూచించాడు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఓ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నాడు.అలాగే పలు బాలీవుడ్ చిత్రాలకు కూడా సంగీత స్వరాలు అందిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube