హీరోయిన్ గా ఏఆర్ రెహమాన్ స్కూల్ విద్యార్థిని.. ఎవరో తెలుసా?

చాలామంది సినీ నటి నటులు నటన పట్ల కాకుండా మరొక కళ లలో కూడా బాగా ఆసక్తి చూపుతుంటారు.చాలామంది నటీనటులు సినిమాల్లోనే కాకుండా వేరే లక్ష్యాన్ని సాధించాలనుకుంటారు.

 Ar Rahman Music School Student Akhila Narayan Turns As Heroine , Ar Rahman, Musi-TeluguStop.com

వాటికోసం ఒకానొక సమయంలో సినిమాలను కూడా దూరం పెడుతుంటారు.ఇదిలా ఉంటే సంగీతం పట్ల ఆసక్తితో పాటు హీరోయిన్ గా కూడా నటిస్తోంది.

ఇంతకీ ఆమె ఎవరంటే.

కాదంబరి సినిమా ద్వారా కోలీవుడ్ సినీ పరిశ్రమకు తొలిసారిగా హీరోయిన్ గా పరిచయమైన నటి అఖిలా నారాయణన్.

అమెరికా నుంచి స్వదేశానికి వచ్చిన అఖిల నారాయణ్ కు సంగీతం పట్ల ఎక్కువ ఆసక్తి ఉండటంతో ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సారథ్యంలోని నడుస్తున్న సంగీతం స్కూల్ లో సంగీత విద్యను అభ్యసిస్తున్నారు.

కానీ అంతలోనే ఆమెకు కాదంబరి సినిమాల్లో నటించే అవకాశం రాగా.

తన విద్యాభ్యాసానికి ఎలాంటి అంతరాయం కలగకుండా.కేవలం ఖాళీ సమయాల్లో మాత్రమే ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంది.

అంతేకాకుండా తన పాత్రకు సంబంధించిన సన్నివేశాల్లో మాత్రమే నటించింది.ఇక ఈ విషయం గురించి మాట్లాడుతున్న అఖిలా.

నటన, సంగీతం అనేవి తనకు రెండు కళ్ళని తెలిపింది.సంగీతాన్ని నేర్చుకుంటూనే నటించేందుకు ప్రాధాన్యత ఇస్తుందామె.

అంతే కాకుండా సంగీతం కోసం ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉందట.

Telugu Akhila Yanan, Ar Rahman, Arrahman, Kadampari, Kollywood, Music School, Tu

ఇక ఆమె తన నాలుగేళ్ల ప్రాయం నుంచే పాడుతున్నానంటూ.పలు అందాల పోటీల్లో కూడా పాల్గొని అవార్డులు, రివార్డులు కూడా అందుకుందట.ఈ రెండు అంశాలే తనను సంగీతం, నటనపై ఇష్టాన్ని కలిగించేలా చేశాయని అందుకే ప్రస్తుతం ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో వెస్ట్రన్ సంగీతంలో శిక్షణ పొందుతున్నానంటూ తెలిపింది.

అంతేకాకుండా పలు వాణిజ్య ప్రకటనల్లో కూడా మోడల్ గా చేస్తుందట.ఇక సంగీతం, నటనలో ఏదో సాధించాలని లక్ష్యంతోనే అమెరికా నుండి స్వదేశానికి వచ్చానంటూ కొన్ని విషయాలు తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube