ఏ.ఆర్. రెహమాన్ బతుకమ్మ పాట వచ్చేసింది..!

తెలంగాణా ఆడపడుచుల పండుగ.పూలనే దేవతగా కొలిచే పండుగ బతుకమ్మ.

 Ar Rahman Composed Bathukamma Song Released By Mlc Kavitha , Allipoola Vennala,-TeluguStop.com

అనాదిగా వస్తున్న ఈ బతుకమ్మ శోభ ఇప్పుడు పల్లెల్లోనే కాకుండా పట్టణాలకు పాకింది.తొమ్మిదిరోజుల పాటు జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ కోసం కొత్త కొత్త పాటలు రిలీజ్ చేస్తుంటారు.

ఈ ఏడాది బతుకమ్మ సంబరాల్లో భాగంగా తెలంగాణా జాగృతి రూపొందించిన బతుకమ్మ పాట అల్లిపూల వెన్నెల.

బతుకమ్మ పాటని దర్శకుడు గౌతం వాసుదేవ మీనన్ డైరెక్ట్ చేయగా.ఈ పాటకు ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ అందించారు.మిట్టపల్లి సురేందర్ లిరిక్స్ అందించిన ఈ పాటని వివిధ తెలంగాణా జిల్లాల్లో షూట్ చేయడం విశేషం.

ఈ పాటలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కనిపించారు.ఈ పాటని కల్వకుంట్ల కవిత నివాసంలో దర్శకుడు గౌతం మీనన్ తో కలిసి రిలీజ్ చేశారు.

రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్.గౌతం మీనన్ టేకింగ్.

మిట్టపల్లి సురేందర్ సాహిత్యం ఈ పాటకి సూపర్ గా కుదిరాయి.ప్రతియేడు బతుకమ్మ పాటలతో పండుగ మరింత కలర్ ఫుల్ గా చేసుకునే ఆడపడుచులు ఈసారి ఎక్కడ విన్నా ఈ పాటే వినిపించేలా ఉంది.

 బతుకమ్మ పండుగ వచ్చింది అంటే.పండుగ శోభని తెలిపే సాంగ్స్ కూడా అంతే ఫేమస్ అవుతాయి.

ఈసారి ఈ పాట అందరిని మెప్పించేలా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube