స్వర మాంత్రికుడుకి అరుదైన గౌరవం

భారతీయ సంగీత ప్రపంచంలో మకుటం లేని మహారాజుగా, ఇండియా నుంచి ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఎఆర్ రెహమాన్.టాలీవుడ్ లో ఓనమాలు నేర్చుకొని, ఇళయరాజా టీంలో వర్క్ చేసి తరువాత తనకంటూ ఒక ప్రత్యేకత సృష్టించుకొని ముందుగా సౌత్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగి తరువాత ఇండియన్ నెంబర్ వన్ గా ఎదిగి హాలీవుడ్ సినిమాలకి పని చేసి ఆస్కార్ అవార్డులు అందుకున్న రెహమాన్ కీర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

 Ar Rahman Appointed Bafta Breakthrough India Ambassador, Tollywood, Bollywood, I-TeluguStop.com

అతని కెరియర్ లో ఎన్నో నేషనల్ అవార్డులు, ప్రభుత్వ రివార్డులు గుర్తింపులు ఉన్నాయి.ఇప్పుడు మరో అరుదైన గౌరవాన్ని స్వర మాంత్రికుడు సొంతం చేసుకున్నాడు.

ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా ఏఆర్ రెహమాన్ నియమితులయ్యారు.బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (బాఫ్టా) ఈ అరుదైన గౌరవాన్ని రెహమాన్ కు అందించింది.

బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారత్ లో ఉన్న ప్రతిభావంతులైన కళాకారులను గుర్తించే పనిలో ఉంటారు.సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తన నియామకంపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.

బాఫ్టాతో కలిసి పనిచేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించారు.మొత్తానికి భారత్ తరుపున అరుదైన గౌరవాన్ని రెహమాన్ సొంతం చేసుకోవడం ద్వారా సినీ, రాజకీయ సెలబ్రిటీలు అందరూ అతన్ని అభినందిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube