హాలీవుడ్ సినిమా చేయబోతున్న మురుగదాస్  

AR Murugadoss to direct Hollywood movie, Tollywood, Telugu Cinema, South Cinema, Indian Cinema, Hero Vijay - Telugu Hero Vijay, Indian Cinema, South Cinema, Telugu Cinema, Tollywood

సౌత్ ఇండియాలో స్టార్ దర్శకుడుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి మురుగదాస్.కమర్షియల్ సినిమాలకి కాస్త సోషల్ ఎలిమెంట్ జోడించి సినిమాలు తెరకెక్కించడంలో మురుగదాస్ కి మంచి నైపుణ్యం ఉంది.ఆయన చివరిగా రజినీకాంత్ తో దర్భార్ సినిమా తెరకెక్కించాడు.ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదు.అయినా కూడా కోలీవుడ్ లో స్టార్ హీరోలు మురుగదాస్ తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.తుపాకీ సీక్వెల్ తెరకెక్కించడానికి మురుగదాస్ గత కొంత కాలంగా ప్లాన్ చేస్తున్నాడు.

TeluguStop.com - Ar Murugadoss To Direct Hollywood Movie

విజయ్ కూడా ఈ సీక్వెల్ కి ఒకే చెప్పేశాడు.ఇక త్వరలో అఫీషియల్ కన్ఫర్మేషన్ వస్తుందని అందరూ అనుకున్నారు.

అయితే ఏ కారణాల వలనో ఈ ప్రాజెక్ట్ నుంచి మురుగదాస్ తప్పుకున్నాడు.ఆ సినిమాని నెల్సన్ దిలీప్ తో విజయ్ చేస్తున్నాడు.

TeluguStop.com - హాలీవుడ్ సినిమా చేయబోతున్న మురుగదాస్-General-Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే మురుగదాస్ ఇప్పుడు తుపాకీ సీక్వెల్ పక్కన పెట్టడానికి వేరే కారణం ఉందని తెలుస్తుంది.

హాలీవుడ్‌ స్టూడియో డిస్నీ పిక్చర్స్‌ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న చిత్రానికి దర్శకత్వం వహించేందుకు మురుగదాస్‌ అంగీకరించారని కోలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న మాట.ద లయన్‌ కింగ్‌, బ్యూటీ అండ్‌ ద బీస్ట్‌’ కోవలోనే భారతీయ మూలాలున్న కథతో ప్రపంచ ప్రేక్షకుల కోసం లైవ్‌ యాక్షన్‌ కమ్‌ యానిమేషన్‌ చిత్రాన్ని డిస్నీ తెరకెక్కించబోతుంది.ఈ సినిమాకి దర్శకత్వం వహించే బాధ్యతలని మురుగదాస్ కి అప్పగించినట్లు తెలుస్తుంది.

త్వరలోనే అధికారిక ప్రకటన రావచ్చని భావిస్తున్నారు.అదే నిజమైతే హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహిస్తోన్న తొలి తమిళ దర్శకుడుగా మురుగదాస్‌ పేరు నిలిచిపోతుంది.

#Hero Vijay

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు