తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు( Star Heroes )గా గుర్తింపు పొందుతున్న చిరంజీవి, నాగార్జున లాంటి స్టార్ హీరోలు వాళ్ళ కాంబినేషన్ లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇలాంటి క్రమంలోనే చిరంజీవి, నాగార్జున వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ కావడమే కాకుండా ఇద్దరు కలిసిమెలిసి ఉంటారు.
కాబట్టి వీళ్ళు ఇద్దరి కాంబో లో సినిమా వస్తె మంచి విజయం సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ పలువురు వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

అయితే వీళ్లిద్దరి ఇమేజ్ ను దృష్టి లో పెట్టుకొని తమిళ్ స్టార్ డైరెక్టర్ అయిన మురుగదాస్( AR Murugadoss ) ఒక కథను చెప్పినట్టుగా వార్తలైతే వస్తున్నాయి.అందులో భాగంగానే ప్రస్తుతం చిరంజీవి నాగార్జున తో సినిమా చేయడానికి ఫిక్స్ అవుతున్నాడు.అయితే శివ కార్తికేయన్ తో మురుగ దాస్ తో సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా పూర్తి అయిన తర్వాత చిరంజీవి, నాగార్జున( Chiranjeevi Nagarjuna ) లతో కలిసి ఒక మంచి సినిమా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు.ఆ సినిమా పూర్తయ్యే లోపు ఈ సినిమాకి సంబంధించిన మొత్తం స్క్రిప్ట్ వర్క్ ని పూర్తి చేసి వీరిద్దరికి బౌండెడ్ స్క్రిప్ట్ ను చెప్పే ప్రయత్నం అయితే చేస్తారట.
అయితే కథ మొత్తం విన్న తర్వాత ఈ సినిమాకి కమిట్ అవ్వాలని వీళ్ళిద్దరూ ఫిక్స్ అవుతున్నట్టుగా తెలుస్తుంది.చూడాలి మరి వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే సినిమా ఎంతటి ఇంపాక్ట్ ను క్రియేట్ చేస్తుంది అనేది…

మురుగదాస్ ప్రస్తుతానికి ఫామ్ లో ఐతే లేడు మరి శివ కార్తికేయన్( Sivakarthikeyan ) తో చేసే సినిమాతో సక్సెస్ ను కొట్టి మళ్ళీ తనని తాను ప్రూవ్ చేసుకుంటే తప్ప ఈ ప్రాజెక్టు మీద మంచి బజ్ అయితే ఏర్పడదు.చూడాలి మరి మురుగదాస్ చిరంజీవి నాగార్జున లని పెట్టి ఎలాంటి సినిమా తీస్తాడు అనేది.ఇప్పటికే చిరంజీవి తో చేసిన స్టాలిన్ సినిమా యావరేజ్ గా ఆడింది.
మరి ఇప్పుడు భారీ సక్సెస్ ని ఇస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…