మహేష్ తీసిన పరువు బన్నీ తిరిగిస్తాడా..?  

Ar Murugadoss Huge Film With Allu Arjun - Telugu Allu Arjun, Ar Murugadoss, Mahesh Babu, Tollywood News

తమిళంలో సూపర్ హిట్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచిన దర్శకుడు ఏఆర్ మురుగదాస్, తెలుగులో కూడా అడపాదడపా సినిమాలు చేస్తూ వచ్చాడు.కాగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేసిన ‘స్పైడర్’ చిత్రంపై రిలీజ్‌కు ముందు అతిభారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Ar Murugadoss Huge Film With Allu Arjun

ఈ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్‌ను షేక్ చేయాలని చూశాడు ఈ డైరెక్టర్.కానీ తానొకటి తలిస్తే, దైవం మరోటి తలిచినట్లు, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సాధించిన రిజల్ట్‌తో అత్తాపత్తా లేకుండా పోయాడు మురుగదాస్.

స్పైడర్ చిత్రం టీజర్‌తో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేసుకుంది.కానీ సినిమాలో కంటెంట్ లేకపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాను తిప్పి కొట్టారు.దీంతో స్పైడర్ అట్టర్ ఫ్లాప్ మూవీగా నిలిచింది.ఈ సినిమా ఘోరంగా పరాజయం పాలు కావడంతో, మురుగదాస్ మళ్లీ తెలుగు చిత్రాన్ని తెరకెక్కించలేదు.

మహేష్ తీసిన పరువు బన్నీ తిరిగిస్తాడా..-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ ఇప్పుడు మరోసారి సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చేందుకు మురుగదాస్ రెడీ అవుతున్నాడు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కోసం ఓ అదిరిపోయే స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు ఈ తమిళ డైరెక్టర్.

కథ పూర్తయ్యాక బన్నీకి వినిపించి, ఆయనతో సినిమా చేసి తెలుగులో మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడు.మహేష్ బాబుతో చేసిన స్పైడర్ చిత్రంతో టాలీవుడ్‌లో నవ్వులపాలైన మురుగదాస్, బన్నీ సినిమాతో మళ్లీ మర్యాదను సంపాదించాలని చూస్తున్నాడు.

మరి టాలీవుడ్‌లో మురుగదాస్ మళ్లీ కమ్‌బ్యాక్ ఇవ్వగలడా లేడా అనేది చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Ar Murugadoss Huge Film With Allu Arjun Related Telugu News,Photos/Pics,Images..

footer-test