మహేష్‌బాబు, తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్‌ల కాంబినేషన్లో ఒక సినిమా ప్రారంభం కాబోతున్న విషయం తెల్సిందే.ప్రస్తుతం ‘బ్రహ్మోత్సవం’ చిత్రంలో నటిస్తున్న మహేష్‌బాబు ఆ చిత్రాన్ని మార్చిలో పూర్తి చేసి ఏప్రిల్‌లో మురుగదాస్ చిత్రంలో నటించాల్సి ఉంది.
కాని ‘బ్రహ్మోత్సవం’ చిత్రీకరణ కాస్త ఆలస్యం అవ్వడంతో ఏప్రిల్‌లో కూడా అదే చిత్రంతో మహేష్‌బాబు బిజీగా ఉండనున్నాడు.దాంతో మురుగదాస్ సినిమా ప్రారంభం ఏప్రిల్‌లో లేదు.
మహేష్‌బాబు ఇటీవలే మరి కాస్త సమయం తర్వాత మురుగదాస్ చిత్రాన్ని ప్రారంభించాలని నిర్మాతలకు సూచించాడు.మురుగదాస్ ఇప్పటికే మహేష్‌బాబు కోసం కథను సిద్దం చేశాడు.
స్క్రిప్ట్ వర్క్‌ను సైతం పూర్తి చేసిన మురుగదాస్ దాదాపు నెల రోజుల నుండి మహేష్ కోసం ఎదురు చూస్తున్నాడు.తాజాగా వచ్చే నెలలో కూడా మహేష్‌బాబు డేట్లు ఇవ్వలేను అని చెప్పడంతో మురుగదాస్ అసహనం వ్యక్తం చేస్తున్నాడు.
వరుసగా సినిమాలు చేసే మురుగదాస్‌ను మహేష్‌బాబు ఎదురు చూపులు చూసేలా చేస్తున్నాడు అని ఆయన సన్నిహితులు అంటున్నారు.ఇక సినిమా ప్రారంభం మరెంతగా మురుగదాస్‌ను మహేష్‌బాబు చికాకు పెడతాడో అని తమిళ సినీ వర్గాల వారు అంటున్నారు.