ఏపీ ఎస్ఈసీ గా నిమ్మగడ్డను డిక్లేర్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ వెనక్కి  

Apsec Withdraws Nimmagadda Appoinment Orders - Telugu Ap Election Comissioner, Ap Sec Withdraws Nimmagadda Ramesh Kumar\\'s Appointment Orders, Nimmagadda Ramesh Kumar

ఏపీ ఎన్నికల కమిషనర్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.హైకోర్టు తీర్పు రాగానే సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చి… విధుల్లో చేరినట్టు ప్రకటించిన నిమ్మగడ్డ, ఆ తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా317 సర్కులర్ ను జారీ చేసింది.

 Apsec Withdraws Nimmagadda Appoinment Orders

కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏపీ ఎస్ ఈ సి గా తిరిగి నిమ్మగడ్డ రమేష్ ను కొనసాగించాలి అని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోగా, సర్క్యులర్ ను ప్రకటించిన కొద్దీ గంటల్లోనే ఆ ఉత్తర్వులను వెనక్కి తీసుకుంటున్నట్లు ఎస్ ఈసీ కార్యదర్శి పేర్కొనడం విశేషం.అయితే రాష్ట్ర ఎన్నికల కమీషనర్ గా భాద్యతలు నిర్వర్తించిన నిమ్మగడ్డ పై పదవీ కాలం ముగిసింది అంటూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో ఆయన కోర్టు ను ఆశ్రయించాల్సి వచ్చింది.

అయితే నిమ్మగడ్డ పిటీషన్ పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఏపీ సర్కార్ కు ఝలక్ ఇస్తూ తిరిగి ఎన్నికల కమీషనర్ గా నిమ్మగడ్డనే కొనసాగాలి అంటూ తీర్పు వెల్లడించింది.అయితే ఇప్పటివరకు ఆయన పదవీ కాలం ముగిసింది అని చెప్పుకొచ్చిన ఏపీ సర్కార్ ఇప్పుడు తాజాగా అసలు ఆయన నియామకమే చెల్లదు అంటూ కొత్త వాదన వినిపిస్తుంది.

ఏపీ ఎస్ఈసీ గా నిమ్మగడ్డను డిక్లేర్ చేసిన కొన్ని గంటల్లోనే మళ్లీ వెనక్కి-Political-Telugu Tollywood Photo Image

కోర్టు లో విచారణ నేపథ్యంలో కూడా బయటపెట్టని ఈ విషయాన్ని ఇప్పుడు ఇదే అంశంపై సుప్రీం ను ఆశ్రయిస్తామంటూ ఏపీ సర్కార్ చెబుతున్నట్లు తెలుస్తుంది.అసలు నియామకమే చెల్లదు అన్నప్పుడు ఆయన పదవీకాలం ముగిసింది అని ఆర్డినెన్స్ తీసుకురావడం ఏంటి అనేది అర్ధం కానీ విషయం.

అలానే హైకోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా నిమ్మగడ్జ వ్యవహరించారని ఏపీ సర్కార్ చెబుతోంది.

అసలు 2016లో నిమ్మగడ్డ నియామకమే చెల్లదనే కొత్త విషయం చెబుతుండడం తో పాటు మరో ఆసక్తికర పరిణామం కూడా చోటు చేసుకుంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా నిమ్మగడ్డ రమేష్‌ బాధ్యతలు తీసుకున్నారంటూ ముందు రోజు ఇచ్చిన సర్కులర్ 317ను ఉప సంహరించుకున్నారు ఎస్ఈసీ కార్యదర్శి.ఓ వైపు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎవరనే సందిగ్దం కొనసాగుతుండగానే ఎస్ఈసీ కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్‌ అధికారి వాణి మోహన్‌ను నియమించడం మరో విశేషం.

దీంతో నిమ్మగడ్డ, ప్రభుత్వం మధ్య వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందోనే ఉత్కంఠ నెలకొంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Apsec Withdraws Nimmagadda Appoinment Orders Related Telugu News,Photos/Pics,Images..

footer-test