మరో నాలుగు రోజుల్లో మహా శివరాత్రి ఉన్న విషయం ప్రజలందరికి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా భక్తులంతా పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లాడానికి తగిన ప్రణాళికలతో సిద్దం అవుతుంటారు.
కాగా ప్రయాణానికి సంబంధించిన అంశంలో ఇప్పటికే ఏపీఎస్ ఆర్టీసీ సిద్దం అవుతుండగా భక్త ప్రయాణికుల కోసం ఓ శుభవార్త చెబుతుంది.అదేమంటే.
ఈ మహా శివరాత్రి సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ, రాష్ట్రం లోని 98 శైవక్షేత్రాలకు, మొత్తం 3,777 ప్రత్యేక బస్సుల్ని నడపనుందని అధికారులు వెల్లడించారు.ఇందులో భాగంగా గుంటూరు జిల్లా నరసరావుపేట వద్దనున్న కోటప్ప కొండకు 856 ప్రత్యేక బస్సులను, కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, అహోబిలంకు 938 ప్రత్యేక బస్సుల్ని నడపనున్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల మంది భక్తులు ఆర్టీసీ సేవల్ని వినియోగించుకుంటారని అధికారుల అంచనా.ఇకపోతే ఈ పండగ రోజుల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధారణ ఛార్జీలనే వసూలు చేస్తున్నట్లుగా ఆర్టీసీ అధికారులు తెలుపుచున్నారు.