ఏప్రియల్ నెలలో పుట్టారా... అయితే మీ గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు     2017-12-31   23:03:16  IST  Raghu V

ఏప్రియల్ నెలలో పుట్టినవారు కొంచెం స్వతంత్రంగా ఉంటారు. వీరు ఎవరి మీద ఆధారపడకుండా సొంతంగా పనులను చేసుకుంటారు. వీరు ఏ పని చేసిన సొంతంగా అలోచించి సొంత నిర్ణయాలతోనే చేస్తారు. వీరు చాలా చురుకుగా ఉండి ఇతరులతో పోటీ పడి మరీ విజయాలను సాధిస్తారు. వీరు తన తెలివితేటలతో ఎదుటి వారితో ఎటువంటి పనిని అయిన సులువుగా చేయించేస్తారు. వీరికి చాలా దైర్యం. అలాగే కోపం కూడా తొందరగా వచ్చేస్తుంది.

ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తీ చేస్తారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఆ నిజాయితీ కోసం స్నేహాన్ని కూడా వదులుకోవడానికి వెనకడుగు వేయరు. వీరికి ఆశలు, ఆశయాలు ఎక్కువగా ఉంటారు. వాటి కోసం ఎంతవరకైనా పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారు. వీరు ఇంట, బయటా కూడా మొదటి స్థానములో ఉండటానికి నిత్యము పోరాటం చేస్తూనే ఉంటారు.

జీవితంలో మంచి అభివృద్ధిని సాధించటంలో సక్సెస్ అవుతారు. వీరి సంసార జీవితం కూడా ఎటువంటి సమస్యలు లేకుండా సంతృపిగా ఉంటుంది. ఈ సమస్య వచ్చిన దైర్యంగా ఎదుర్కొంటారు. ఏప్రియల్ నెలలో పుట్టినవారు దేవుణ్ణి నమ్ముతూ విజయాలను సాధిస్తూ ఉంటారు. వీరి ఆదర్శం చాలా మందికి దారి చూపుతుంది.

ఆరోగ్యము : ఈ నెలలో పుట్టిన వారికి కళ్ళు, చెవులు మరియు పళ్ళకి సంబంధించిన వ్యాదులు వస్తూ ఉంటాయి. తరచుగా జ్వరం, తలనొప్పి వీరిని వేధిస్తుంది.

ధనము : వీరి సంపాదన చాలా బాగుంటుంది. ఒడి దుడుకులు ఎదురైనా సరే తట్టుకొనే శక్తి ఉంటుంది.

లక్కీ వారములు : సోమ, మంగళ ,గురు మరియు శుక్ర వారములు.

లక్కీ కలర్ : పింక్ మరియు రోజ్ కలర్.

లక్కీ స్టోన్ : ముత్యము మరియు ముదురు గోమేధికం.