ఏప్రిల్ 20వ తారీఖు నుంచి ఆన్ లైన్ అమ్మకాలు షురూ.... 

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశ ప్రధానమంత్రి మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాల్లో అత్యవసర లాక్ డౌన్ విధించిన సంగతి అందరికీ తెలిసిందే.అయితే ఇందులో భాగంగా ప్రజలకు అవసరమైనటువంటి సదుపాయాలు తప్ప మిగిలిన ఇతర సదుపాయాలను ప్రభుత్వ అధికారులు మూసివేశారు.

 April 20th, Online Shopping, Amazon, Flip Kart, E Commerce, E Bay, Online Sales-TeluguStop.com

దీంతో పలు సంస్థలను తాత్కాలికంగా మూసివేయగా,  మరి కొన్ని సంస్థలు తమ ఉద్యోగస్తులకు ఇంటి నుంచి పని చేసుకునే సదుపాయం కల్పించారు.అయితే ఈ క్రమంలో ఆన్ లైన్ షాపింగ్ కూడా బంద్ చేశారు.

ప్రస్తుత కాలంలో కొందరు ఏ చిన్న వస్తువునైనా ఆన్ లైన్ లో  కొనుక్కుంటూ తమ ఇంటి వద్దకే తెప్పించుకుంటున్నారు. దీంతో లాక్ డౌన్ కారణంగా గత కొద్దికాలంగా ఆన్ లైన్ షాపింగ్ లు మూసివేయడంతో కొందరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

అలాంటివారికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.ఈనెల 20వ తారీకు నుంచి ప్రముఖ ఆన్ లైన్ షాపింగ్ సంస్థలైనటువంటి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ తదితర సంస్థల్లో కొనుగోళ్లు చేయవచ్చని తెలిపింది.

అయితే ఇందుకు గాను కొన్ని షరతులను కూడా విధించింది.

అయితే ఇందులో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, టీవీ ఫ్రిడ్జ్ ఏసీ వంటి వాటిని ఇకపై ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి ఇంటి వద్దకే తెప్పించుకోవచ్చు.

డెలివరీ తీసుకునే సమయంలోనూ మరియు డబ్బు చెల్లించే సమయంలోనూ సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా వ్యవహరించాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది.అంతేగాక గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే కూలీలకు కూడా పనులకి వెళ్ళవచ్చని తెలిపింది.

దీంతో కొంతమేర చిన్నపాటి రోజువారి కూలీలు, నిరుపేదల ఊరట కలిగినట్లయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube