1051 పోస్టులతో గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ విడుదల

ఏపీలో మరోసారి పంచాయతీ కొలువుల భర్తీ ప్రారంభమైంది.అభ్యర్థులు కొన్నాళ్లుగా ఎదురు చూస్తున్న గ్రూప్‌-3 నోటిఫికేషన్‌ను ఏపీపీఎస్సీ శుక్రవారం విడుదలచేసింది.

 Appsc Group 3 Notification Relised-TeluguStop.com

ఏపీ పంచాయతీ రాజ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌లో 1051 పంచాయతీ సెక్రెటరీ(గ్రేడ్‌-4) పోస్టులను భర్తీ చేయనున్నారు.ఏదైనా డిగ్రీ పాసైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ నెల 27 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తు గడువు ఉంటుంది.పరీక్ష ఫీజును మాత్రం జనవరి 18 రాత్రి 11.59లోపు చెల్లించాలి.2018 జూలై 1 నాటికి 18 ఏళ్లు పూర్తయి 42 ఏళ్లకు మించని అభ్యర్థులు అర్హులు.ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మరో 5 ఏళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు మరో 10 ఏళ్ల వయో పరిమితి సడలింపు ఉంటుంది.

కొత్తగా ఏర్పడిన 1000 పోస్టులతోపాటు క్యారీ ఫార్వర్డ్‌ అయిన 51 పోస్టులను భర్తీచేయనున్నారు.

దరఖాస్తుల సంఖ్య 25 వేలకు మించితే ఏప్రిల్‌ 21న స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు.ఆగస్టు 2న మెయిన్స్‌ నిర్వహిస్తారు.పరీక్షలు ఆబ్జెక్టివ్‌ టైపులోనే నిర్వహిస్తారు.

ఆఫ్‌లైన్‌లో నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్‌లో 150 ప్రశ్నలు, ఆన్‌లైన్‌లో నిర్వహించే మెయిన్స్‌లో 300 ప్రశ్నలు ఉంటాయి.అభ్యర్థులు అప్లికేషన్‌ ఫీజు కింద రూ.250, పరీక్ష ఫీజు కింద రూ.80 చెల్లించాలి.రాత పరీక్షల్లో నెగిటివ్‌ మార్కుల విధానం అమలు చేస్తారు.

జిల్లాల వారీగా పోస్టులు :

శ్రీకాకుళం-114

విజయనగరం-120

విశాఖపట్నం-107

తూర్పుగోదావరి-104

పశ్చిమగోదావరి-25

కృష్ణా-22

గుంటూరు-50

ప్రకాశం-172

నెల్లూరు-63

చిత్తూరు-141

అనంతపురం-41

కర్నూలు-90

కడప-2

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube