ఫారెస్ట్ రేంజ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల  

నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది ఏపీపీఎస్సి. ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. జులై 1నాటికి 18 ఏళ్లు నిండి 28 ఏళ్ల వయసు మించని వారు ఈ ఉద్యోగాలకు అర్హులని ఆ నోటిఫికేషన్ lo పొందుపరిచింది . ఈ నెల 10 నుంచి 31 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని, పరీక్షకు రుసుము చెల్లింపునకు డిసెంబర్‌ 30 ఆఖరు తేదీ అని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

Appsc Forest Jobs Notification Relised-

Appsc Forest Jobs Notification Relised

మొత్తం 24 పోస్టులకు గానూ నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 24న స్క్రీనింగ్, ఏప్రిల్ 24న స్క్రీనింగ్‌, ఏప్రిల్‌ 28, 29, 30 తేదీల్లో మెయిన్స్‌ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది. అర్హులైన అభ్యర్థులు psc.ap.gov.com వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రకటించింది.