రాజ్యసభలో విదేశీ నిధుల నియంత్రణ సవరణ బిల్లు ఆమోదం

విదేశీ నిధుల నియంత్రణ బిల్లును రాజ్యసభ ఆమోదం తెలిపింది.ఈ నెల 21 ప్రవేశ పెట్టిన బిల్లును ఈ రోజు ఆమోదించింది.

 Approval, Foreign Funds, Regulation Bill, Rajya Sabha-TeluguStop.com

భారత దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై విదేశీ నిధుల ప్రభావం పడకుండా ఉండేందుకు ఈ బిల్లు తోడ్పడుతుందని దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ వెల్లడించారు.జాతీయ, అంతర్జాతీయ భద్రతకు నిధుల నియంత్రణ సవరణ బిల్లు (ఎఫ్ సీఆర్ఏ) పని చేస్తుందన్నారు.

విదేశీ నిధులు కాపాడుకునేందుకు ఈ కొత్త చట్టాన్ని తీసుకొస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

భారత దేశ రాజకీయ, సామాజిక పరిస్థితులపై విదేశీ నిధుల ప్రభావం చూపకుండా ఉండేందుకు ఎప్ సీఆర్ఏ బిల్లు ఉపయోగపడుతుందన్నారు.

విదేశీ నిధులు తీసుకుంటున్న కొన్ని కంపెనీలు తమ గుర్తింపులను దాచిపెట్టి వ్యవహారాలు జరుపుతున్నాయని, అందుకే ఆధార్ కార్డును తీసుకొచ్చినట్లు దేశీయ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు.ఈ చట్టాన్ని 2010లో అప్పటి కేంద్ర హోం మంత్రిగా ఉన్న చిదంబరం తీసుకొచ్చారన్నారు.ఆ ఏడాది సుమారు రూ.20 వేల కోట్ల విదేశీ నిధుల రూపంలో వచ్చాయని నిత్యానంద్ రాయ్ గుర్తు చేసుకున్నారు.ఇందులో 10 వేల కోట్ల నిధుల గురించి ఎలాంటి సమాచారం లేదన్నారు.విదేశీ బిల్లుల సమాచారం తెలియడం లేని కారణంగా ఎఫ్ సీఆర్ఏ బిల్లును అమలులోకి తీసుకొస్తున్నామన్నారు.

ఈ బిల్లుతో ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదని, మంచి ఉద్దేశంతో పని చేస్తున్న ఎన్జీవోలకు సమస్య ఉండదని ఎంపీ బాలసుబ్రమణియన్ అన్నారు.ఎఫ్ సీఆర్ఏ చట్టం ద్వారా ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు.

ఈ చట్టం అమలుతో ఎన్జీవోలు బ్యాంక్ ఖాతా తెరిచేందుకు ఢిల్లీకి రావాల్సిన అవసరం లేదని, సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా తెరుచుకోవాలన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube