కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణాల అధ్యయనానికి కమిటీ నియామకం

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలను పరిశీలించేందుకు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీని నియమించింది.ఈ మేరకు కేంద్ర జలసంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ సారథ్యంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది.

 Appointment Of Committee To Study Constructions Of Kaleswaram Project-TeluguStop.com

అదేవిధంగా ఈ కమిటీకి అమితాబ్ మీనా మెంబర్ సెక్రటరీగా వ్యవహరించనున్నారు.అయితే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది.

ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం మరియు సుందిళ్ల బ్యారేజీలపై సమగ్రంగా విచారణ జరపాలని ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసింది.రాష్ట్ర ప్రభుత్వ లేఖపై స్పందించిన ఎన్డీఎస్ఏ మూడు బ్యారేజీలపై కమిటీని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నేపథ్యంలో బ్యారేజీలను పరిశీలించి కుంగుబాటుకు, పగుళ్లు ఏర్పడటానికి గల కారణాలను కమిటీ సభ్యులు విశ్లేషించాలని కమిటీకి సూచించింది.అదేవిధంగా తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయాలను కూడా తెలపాలన్న ఎన్డీఎస్ఏ నాలుగు నెలల్లో నివేదికను అందించాలని కమిటీకి తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube