వారెవ్వా.. వృద్దుడి ప్రాణాలను కాపాడిన యాపిల్ వాచ్.. ఎలా అంటే !

రోజురోజుకూ టెక్నాలిజీ అభివృద్ధి చెందుతూనే ఉంది.ఆ టెక్నాలజీ ఉపయోగించుకుని ప్రజలు తమ అవసరాలను తీర్చుకుంటున్నారు.

 Apple Watch's Fall Detection Feature Saves 78-year-old Man's Life, Fall Detectio-TeluguStop.com

అయితే ఇప్పుడు అదే టెక్నాలజీ తో ప్రజల ప్రాణాలు కూడా కాపాడవచ్చని వైద్యులు చెబుతున్నారు.ఒక వాచ్ ఒక వృద్ధుడిని కాపాడింది.

అలా ఎలా జరుగుతుందని ఆశ్చర్య పోతున్నారా ఇది నిజమండి బాబు ఒక వాచ్ ఒక వ్యక్తిని ప్రాణాలు పోకుండా రక్షించింది.

అసలు మ్యాటర్ లోకి వెళ్తే అమెరికాలోని నార్త్ కరోలినా లో నివసించే మిక్ అనే 78 సంవత్సరాల వ్యక్తి వాకింగ్ కు బయటకు వెళ్ళాడు.

వాకింగ్ చేస్తూనే కింద కళ్ళు తిరిగి పడిపోయాడు.అలా పడిపోయిన ఆయన కదలక పోవడంతో కొద్దీ సేపటికే ఆయన చేతికి పెట్టుకున్న యాపిల్ వాచ్ వెంటనే అప్రమత్తమయ్యి ఎమర్జన్సీ నెంబర్ 911 కు మెసేజ్ చేసింది.

Telugu Apple Watch-Latest News - Telugu

ఆ మెసేజ్ చుసిన వైద్య సిబ్బంది వెంటనే ఆ వ్యక్తి దగ్గరకు చేరుకొని ఆయనను ఆసుపత్రికి తరలించారు.ఆ వాచ్ వెంటనే అప్రమత్తమయ్యి ఉండకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేది.ఆ వాచ్ ఆలా స్పంధించిందని మిక్ కు స్పృహలోకి వచ్చే వరకు తెలియదు.ఆయన స్పృహలోకి వచ్చాక ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్య పోయానని ఆయన తెలిపాడు.

Telugu Apple Watch-Latest News - Telugu

నా వాచ్ నన్ను కాపాడిందని తెలిసి ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందంగా కూడా ఉందని ఇలాంటి వాచ్ 65 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరు తప్పకుండ ఉపయోగించాలని ఆయన అభిప్రాయ పడ్డారు.మిక్ ఒక నిముషం పాటు కదలపోవడంతో వెంటనే ఆ వాచ్ అప్రమత్తమైంది.ఆ వాచ్ సర్వీసు నెంబర్ కు మెసేజ్ చేయడంతో పాటు లొకేషన్ తో సహా షేర్ చేయడంతో వైద్య అధికారులకు వెంటనే చేరుకునేందుకు ఇబ్బంది అవ్వలేదు.మొత్తానికి ఒక వాచ్ ప్రాణాలు కాపాడడంతో ఇది విన్న ప్రజలు ఇప్పటికి నమ్మలేక పోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube