నమ్మలేని నిజం : నీటిలో పడ్డ వ్యక్తిని కాపాడిన యాపిల్‌ వాచ్‌  

Apple Watch Sos Feature Helped Save A Man Life-

టెక్నాలజీ ఎంతగా పెరిగిందంటే చనిపోతున్న మనుషులను కూడా కాపాడేంతగా పెరిగింది.గుండెలు మార్చే టెక్నాలజీ వచ్చింది.అయితే ప్రమాదంలో ఉన్న వారిని కాపాడేందుకు మాత్రం ఇంకా సరైన టెక్నాలజీ రాలేదు అనేది కొందరి వాదన...

Apple Watch Sos Feature Helped Save A Man Life--Apple Watch SOS Feature Helped Save A Man Life-

తాజాగా జరిగిన ఒక సంఘటనతో ప్రమాదంలో ఉన్న వారికి కూడా టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుందని నిరూపితం అయ్యింది.ఎక్కడైనా ప్రమాదంలో ఉంటే చేతిలో ఫోన్‌ ఉంటే వెంటనే కాల్‌ చేసి వివరాలు చెబితే సహాయం చేసేందుకు వస్తారు.కాని ఫోన్‌ లేకున్నా కూడా మెక్‌ కార్మిక్‌ ప్లేస్‌కు సాయం అందింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… చికాగోకు చెందిన ఈయన 31 స్ట్రీట్‌ హార్బర్‌ నుండి ఈయన స్కీ రైడింగ్‌ చేస్తున్నాడు.ఆ సమయంలో ఒక పెద్ద అల రావడంతో అతడు నీటిలో పడిపోయాడు.ఒంటరిగా ఉండటంతో పాటు అతడి వద్ద ఉన్న ఫోన్‌ నీటిలో పడిపోయింది.కొంత దూరాన ఒక స్టీమర్‌ అయితే కనిపిస్తుంది.

Apple Watch Sos Feature Helped Save A Man Life--Apple Watch SOS Feature Helped Save A Man Life-

కాని ఎంతగా అరచినా కూడా వారికి ఈయన అరపులు వినిపించడం లేదు.స్విమ్మింగ్‌ చేసే ఓపిక లేదు.మెల్ల మెల్లగా నీటిలోకి మునిగి పోతున్నాడు.

ఆ సమయంలోనే అతడికి తన చేతికి ఉన్న వాచ్‌ గుర్తుకు వచ్చింది.

యాపిల్‌ వాల్‌లో ఎమర్జెన్సీ కాలింగ్‌ ఆప్షన్‌ ఉంటుంది.వెంటనే అతడు ఎమర్జెన్సీ కాల్‌ చేయడంతో పాటు ఆ వాచ్‌ ఉన్న లొకేషన్‌ను జీపీఎస్‌ ద్వారా వారికి తెలిసేలా చేశాడు.దాంతో 12 నిమిషాల్లో అతడి వద్దకు హెలికాప్టర్‌ వచ్చింది.అదే సమయంలో ఒక స్విమ్మర్‌ బోట్‌ కూడా చేరుకుంది.

అలా అతడు ప్రమాదం నుండి బయట పడ్డాడు.తాను మృత్యువు ఒడిలోకి జారుకున్నట్లుగానే భావించాను.కాని అదృష్టం కొద్ది యాపిల్‌ వాచ్‌లో ఎమర్జెన్సీ కాలింగ్‌ ఉండటంతో బతికి పోయానంటూ కార్మిక్‌ అంటున్నాడు...