వావ్: ఎడారిలో ఆపిల్స్ ను పండించిన రైతు...!

ఎక్కడపడితే అక్కడ, అన్నిచోట్ల ఆపిల్ చెట్లు నాటడం కుదరదు అన్న సంగతి అందరికీ తెలిసిందే.ఆపిల్ చెట్లు పెరగాలంటే వాతావరణం చాలా చల్లగా ఉంటూ ఒక సభ్యునిగా ఉండాలి.

 Apple, Trees, Farmer, Gujarath, Desert-TeluguStop.com

అయితే తాజాగా గుజరాత్ రాష్ట్రంలోని కచ్ ఎడారి లో ఓ సన్నకారు రైతు ఏకంగా ఎడారిలో సిమ్లా ఆపిల్ ను పండించాడు.వినడానికి ఇది విడ్డూరంగా ఉన్నా… ఇది మాత్రం నిజం.

ఈ ఘనతను సాధించడానికి సదరు రైతు ఎంతగానో కష్టపడ్డాడు కూడా.ఆ రైతు పేరు శాంతిలాల్ దేవ్ జి భాయ్ మవాని.

అయితే తాను పండించిన రకం ఆపిల్ పండ్లు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో పెరగడానికి సహజంగా సున్నా డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు అవసరం.అయితే కొన్ని చర్యలు చేపట్టిన తర్వాత మాత్రమే ఆ పండ్లు 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా తట్టుకోగలవు.

అయితే ఎడారిలో ఎండలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా.అయితే ఇందుకోసం ఆ రైతు సూర్యుడి కిరణాలు చెట్టు మీద నేరుగా పడనివ్వకుండా చెట్లపైన భారీగా ఒక గ్రీన్ నెట్ ఏర్పాటు చేశాడు.కొత్తగా నాటిన ఆపిల్ మొక్క నుండి పండ్లు రావడానికి రెండు సంవత్సరాల సమయం పడుతుంది.మొదటిసారి కాపు కేవలం 30 నుండి 40 రూపాయలు మాత్రమే లభిస్తాయి.

ఆ తర్వాత వాటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.తాను పండించిన మొక్కలను మొదటగా రైతు హిమాచల్ ప్రదేశ్ నుండి వారి ప్రాంతానికి తెప్పించాడు.

ఇక వారి ప్రాంతంలో ప్రతి పది అడుగుల దూరంలో ఒక్కో మొక్క నాటించాడు.రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఆ పంట చేతికి వచ్చింది.

అయితే ఎడారి కావడంతో ఆ రైతు పంటను పండించడానికి చాలా శ్రమ పడ్డాడు.దానికి కారణం చెట్లకి నీరు అందించడమే.

ఎడారి ప్రాంతంలో నీరు అంటే అంత ఆషామాషీ కాదు కదా.పోసిన నీరు పోసినట్లు గాని ఇంకి పోవడంతో ఎక్కువ నీరు పోయాల్సి వచ్చింది.ఏది ఏమైనా చివరికి ఆ రైతు కలలు కన్నా రోజు రానే వచ్చింది.చివరికి తాను అనుకున్న ఆపిల్ పండ్లను ఎడారిలో పండించాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube