టెక్నిషియన్లు చేసిన పాడుపనికి మహిళకు భారీ మూల్యం చెల్లిస్తున్న ఆపిల్ సంస్థ..!

ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే మొబైల్స్ లో మొదటి స్థానం ఏది అంటే అందరూ టక్కున సమాధానం ఇచ్చేది ఆపిల్ అని.ఆపిల్ సంస్థ కేవలం మొబైల్ రంగంలో మాత్రమే కాకుండా ఎన్నో ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీలో దూసుకు వెళ్తుంది.

 Apple Pays A High Price For The Work Done By The Technicians ..! Technisian, App-TeluguStop.com

అయితే ఇంత పేరున్న ఆపిల్ కంపెనీ విద్యార్థికి మాత్రం ఏకంగా 36 కోట్లు పెనాల్టీ చెల్లించింది అని తెలుసా.దీనికి కారణం ఆపిల్ సంస్థ కు చెందిన ఇద్దరు టెక్నీషియన్లు చేసిన పాడు పని.ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.

ఆపిల్ సంస్థకు చెందిన మొబైల్ రిపేర్ కు రావడంతో ఈ సంస్థకు చెందిన ఇద్దరు టెక్నీషియన్లు ఆ మొబైల్ ఓనర్ అయిన మహిళకు సంబంధించిన 10 పర్సనల్ ఫోటోలను అలాగే వీడియోలను టెక్నీషియన్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అయితే ఆ విషయాన్ని సదరు మహిళలకు వారి స్నేహితులు చెప్పడంతో వాటిని సోషల్ మీడియా నుంచి తొలగించింది.

Telugu Apple, Fine, Penality, Technisian-Latest News - Telugu

అయితే తాను ఆ ఫోటోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయకపోవడంతో అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించింది.దీంతో అసలు విషయం తెలుసుకున్న ఆ మహిళ న్యాయ పోరాటానికి దిగింది.తనకు జరిగిన నష్టం కారణంగా నష్టపరిహారంగా ఈ విధంగా తనకు 50 లక్షల డాలర్లు చెల్లించాలని ఆమె తరపు లాయర్లు ఆపిల్ కంపెనీని డిమాండ్ చేశారు.

Telugu Apple, Fine, Penality, Technisian-Latest News - Telugu

ఈ కేసు విచారణలో భాగంగా ఆ మహిళకు సంబంధించిన ఫొటోలు వీడియోలను సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేయడం కారణంగా ఐఫోన్ సర్వీస్ సెంటర్ లో పనిచేస్తున్న ఇద్దరు టెక్నీషియన్లను ఆపిల్ సంస్థ వారి కంపెనీ నుంచి తొలగించింది.ఇకపోతే ఈ సంఘటన 2016 సంవత్సరంలో జరిగింది.ఇందుకు సంబంధించిన తీర్పు తాజాగా వెలువడటంతో ఆపిల్ సంస్థ సదరు మహిళకు 50 లక్షల అనగా మన భారత కరెన్సీలో ఏకంగా 36 కోట్ల రూపాయల నష్ట పరిహారం చెల్లించింది.ఈ సంఘటన నేపథ్యంలో భాగంగా ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా ఉండేందుకు కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆపిల్ కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube