అలా చేస్తే 11 కోట్లు మీ సొంతం అంటున్న యాపిల్..!

మొబైల్ రంగంలో ఎన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు వచ్చిన ఆపిల్ సంస్థ యొక్క ఫోన్ల డిమాండ్ మాత్రం ఎప్పటికి తగ్గదు.దానికి కారణం ఆ సంస్థ వారి వినియోగదారులకు అందించే సెక్యూరిటీ కోసమే.

 Apple Security Research Device Program, Apple, 11crores, Detect Bug, Apple Offe-TeluguStop.com

సెక్యూరిటీకి ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది యాపిల్ సంస్థ.ఎప్పటికప్పుడు కొత్త మోడల్స్ ను యాపిల్ సంస్థ విడుదల చేస్తూ వారి అభిమానులను సంతోష పరుస్తుంది.

ఇదే నేపథ్యంలో కొత్తగా విడుదల చేసిన మొబైల్స్ లేదా ఇతర పరికరాలలో ఉండే పొరపాట్లను గుర్తించి వారి కంపెనీకి తెలియజేస్తే పెద్ద ఎత్తున ప్రైజ్ మనీ ఇస్తూ ఉంటుంది యాపిల్ సంస్థ.యాపిల్ తన ఐఫోన్ లో సంబంధించి ప్రైవసీ పరంగా అలాగే సెక్యూరిటీ పరంగా మరింత సురక్షితంగా ఉంచేందుకు సెక్యూరిటీ రీసెర్చ్ డివైసెస్ ప్రోగ్రాం మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా ఎవరైనా తప్పు కనిపెడితే మాత్రం కొన్ని కోట్లలో డబ్బులను ఆర్జించవచ్చు టెక్ నిపుణులు.ఇదివరకు కాలంలో కూడా ఇలాంటి ప్రోగ్రాంలో పాటిస్పేట్ చేసిన ఎందరో టెక్ నిపుణులు కొన్ని కోట్ల రూపాయలను గడించారు.

సెక్యూరిటీ రిసార్ట్స్ డివైస్ ప్రోగ్రాం కోసం భద్రత పరిశోధకులకు యాపిల్ సంస్థ కొన్ని ప్రత్యేకమైన ఐఫోన్ యూనిట్లను కూడా వారికి పంపిస్తుంది.ఈ ఫోన్లు హ్యాకింగ్ చేయడానికి కాస్త సులువుగా ఉంటాయని, ప్రత్యేక ఐఫోన్లను స్వీకరించి పరిశోధకులు వారు ఇచ్చే నియమ నిబంధనలను పాటించి అందులో ఉన్న భద్రతా లోపాలను గుర్తించాలి.

Telugu Apple, Appleoffers, Applesecurity, Detect Bug, Mobiles, Prize, Security-L

ఇకపోతే ఆపిల్ సంస్థల ఫోన్స్ సెక్యూరిటీ రీసెర్చ్ డివైజెస్ ప్రోగ్రాం ద్వారా నడపబడుతుంది.ఒకవేళ ఇందులో పెద్ద బగ్ ను గుర్తిస్తే వారికి కింద 1.5 మిలియన్ డాలర్లు ప్రైజ్ మనీగా అందజేస్తుంది.ఈ సొమ్ము భారత కరెన్సీలో దాదాపు 11 కోట్ల రూపాయలకు సమానం.

ఇందులో భాగంగానే ఇండిపెండెంట్ పరిశోధకులు యాపిల్ సంస్థతో కలిసి పని చేసినందుకు వారికి అభినందనలు తెలియజేసింది.వారందరూ యాపిల్ సంస్థకు సంబంధించిన కొన్ని కోట్ల రూపాయలను సంపాదించడమే వారికి ఉన్న గోల్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube