Apple: ఐఫోన్‌ వినియోగదారులారా, అప్రమత్తం కండి.. దాడి చేస్తున్నాయి!

యాపిల్‌ ఐఫోన్‌ క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.దీనికోసం ఆస్తులు అమ్మేవారిని కూడా మనం చూడవచ్చు.

 Apple Iphone Users Dont Be Alarmed Under Attack-TeluguStop.com

అంతలాగ ఈ మొబైల్ ప్రజాధారణ పొందింది.మన సమాజంలో ఎంతోమంది దీన్ని స్టేటస్ సింబల్ గా వాడుతారంటే దాని విశిష్టత అర్ధం చేసుకోవచ్చు.

తాజా సర్వే ప్రకారం, మన దేశంలో ప్రతి 100 మందిలో ఒక్కరైనా ఈ మొబైల్ ని వాడుతున్నారు.ఈ క్రమంలో ఈ ఫోన్ లక్ష్యంగా అనేక సైబర్ దాడులు జరుగుతున్నాయి.

అందుకే ఆపిల్ ఫోన్ వినియోగదారులకు సదరు కంపెనీ జాగ్రత్తలు చెబుతోంది.

తాజాగా ఐఫోన్‌లపై దాడి చేస్తున్న ప్రమాదకరమైన ఐఫోన్‌ యాప్స్‌ను యాపిల్‌ బ్లాక్‌ చేసినట్టు సమాచారం.

ఐఫోన్‌లపై దాడులు చేసేందుకు వాడే మాల్వేర్‌ను ఎవరు తయారు చేశారనే విషయాలు సైతం తాజాగా వెలుగులోకి వచ్చాయట.గూగుల్‌కు చెందిన TAG (థ్రెట్ అనాలిసిస్ గ్రూప్) హ్యాకింగ్, దాడుల్ని గుర్తిస్తుంది.

తాజాగా విడుదలైన ఓ నివేదిక ప్రకారం.ఇటాలియన్‌ సాఫ్ట్‌ వేర్‌ సంస్థ RCS తయారు చేసిన ‘హెర్మిట్’ అనే స్పైవేర్‌ ఐఫోన్‌లపై దాడి చేసి.

ఆఫోన్‌ పనితీరు సన్నగిల్లేలా చేస్తుంది.ఈ స్పైవేర్ మీ ఫోన్‌లో ఎంటర్‌ అయ్యిందంటే చాలు హ్యాక్‌ చేయడం, ఆడియోను రికార్డ్ చేయడం, అనధికారిక కాల్స్‌ లిఫ్ట్‌ చేయడం, ఈమెయిల్‌లు చెక్‌ చేయడం.

వంటి అసాంఘిక కార్యకలాపాలు చేస్తుంది.

Telugu Apple, Ups-Latest News - Telugu

అంతేకాకుండా ఐఫోన్‌లలోకి ఎంటర్‌ అయ్యే ఈ వైరస్‌ గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి కానీ యాపిల్‌ స్టోర్‌ నుంచి సాధ్యపడదని సదరు రిపోర్ట్‌లో తేలడం కొసమెరుపు.సైడ్‌ లోడింగ్‌ ద్వారా ఐఫోన్‌లలోకి ఎంటర్‌ అవుతున్నట్లు నివేదిక నిర్ధారించింది.సైడ్‌లోడింగ్‌ అంటే USB, బ్లూటూత్, wfi లాంటి ఇతర పద్ధతుల ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు బదిలీ చేసే సామర్ధ్యం ఉన్న మీడియా ఫైల్స్‌ ద్వారా ఫోన్‌లపై అటాక్‌ చేస్తున్నట్లు తేలింది.

ఈ సందర్భంగా యాపిల్‌ సంస్థ ఐఫోన్‌ వినియోగదారుల్ని హెచ్చరించింది.డేటా షేరింగ్‌ విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube