ప్రపంచవ్యాప్తంగా ఆపిల్ మొబైల్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.కేవలం మొబైల్స్ మాత్రమే కాకుండా ఆపిల్ సంస్థకు చెందిన కంప్యూటర్లు, ల్యాప్ టాప్స్ ఇంకా ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా ఎంతగానో ప్రాచుర్యం పొందాయి.
ప్రతి సంవత్సరం ఆపిల్ సంస్థ వారి అభిమానుల కోసం కొత్త మోడల్ ఫోన్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.ఇకపోతే తాజాగా ఆపిల్ సంస్థ ఐఫోన్ 12 మోడల్ ను మార్కెట్లోకి విడుదల చేసింది .నీలం, ఎరుపు, నలుపు, ఆకుపచ్చ వంటి రంగులలో ఈ ఫోన్ ప్రజలకు లభించబోతోంది.
వీటి ధరల విషయానికి వస్తే.భారతీయ మార్కెట్లో ఐఫోన్ 12 మినీ ను రూ.69, 990 కి సొంతం చేసుకోవచ్చు.అలాగే ఐఫోన్ 12 ను రూ.79,900 కు పొందవచ్చు.వీటితో పాటు అక్టోబర్ 30వ తారీఖున ఐఫోన్ 12 ప్రో ను విడుదల చేయబోతోంది.అలాగే నవంబర్ 6న ఐఫోన్ 12 ప్రో మాక్స్ ను విడుదల చేయబోతోంది.
ఇకపోతే వాటి ధరల విషయానికొస్తే.ఐఫోన్ 12 pro రూ.1,19,900 గా.అలాగే ఐఫోన్ 12 ప్రో మాక్స్ రూ.1,29,900 కు పొందవచ్చు.
ఇక ఐఫోన్ 12 ఫోన్ సంబంధిత విషయాలకి వస్తే.ఇందులో 5g సపోర్ట్ అందించబోతున్నారు.అలాగే ఈ ఫోన్స్ లో a14 ప్రాసెసర్ ఉపయోగించారు.
వీటితో పాటు అత్యాధునిక టెక్నాలజీ కలిగిన కెమెరాలను, మరింత ఆక్వా క్వాలిటీ కలిగిన డిస్ప్లే ను అందించబోతున్నారు.వీటితో పాటు మెగా సేఫ్ అని పిలువబడి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీతో సరికొత్త వర్షన్ ను కూడా ఇందులో అందించారు.
ఈ ఫోన్ కొన్న సమయంలో చార్జ్ కు సంబంధించిన అడాప్టర్ లభించదు.ఇందుకోసం ప్రత్యేకంగా అడాప్టర్ ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది.ఒకవేళ ఆపిల్ సంబంధించిన అడాప్టర్ కు ముందే కలిగి ఉంటే మళ్లీ కొత్తది కొనాల్సిన అవసరం ఉండదు.