నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌: భారత్‌లో తయారవుతోన్న ''ఐఫోన్ 12''!

భారత్ లో నిరుద్యోగులకు యాపిల్ సంస్ద గుడ్ న్యూస్ చెప్పింది.ఐఫోన్-12 స్మార్ట్‌ఫోన్లను భారత్ లో తయారు చేస్తున్నట్టు యాపిల్ సంస్ద వెల్లడించింది.ఇంకా దీనికి సంబంధించిన ఉత్పత్తి ప్రక్రియను తైవాన్‌కి చెందిన విస్ట్రాన్ కంపెనీ ప్రారంభించింది.కర్ణాటకలోని కోలార్ జిల్లా నరసాపురలో గల ఫ్లాంట్‌లో ఐఫోన్ 12 కాంపోనెట్స్ ఉత్పాత్తి ప్రారంభం అయ్యింది.

 Apple Industry Good News For Un Employees, Iphone 12, Made In India, Apple Suppl-TeluguStop.com

అయితే ఈ సంస్దలో దశల వారీగా దాదాపు 10 వేల మందికిపైగా ఉద్యోగాలు కల్పించాలని సంస్ద ఆలోచిస్తున్నట్టు సమాచారం.ఇక ఇప్పటికే రెండు వేల మంది స్థానికులకు సంస్ద ఉద్యోగం ఇచ్చినట్టు ఆ సంస్ద తెలిపింది.

కాగా ఈ సంస్దలో డిప్లొమా చదివిన వారికి వాక్-ఇన్‌‌ ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టు తెలిపింది.

ఎక్సపీరియన్స్ ఉన్నవారితో పాటు ఫ్రెషర్లకు కూడా మరిన్ని అవకాశాలు ఇవ్వనున్నట్టు సంస్ద ప్రకటించి.

ఇందులో అన్ని కుదిరితే వచ్చే ఏడాదికి మేడిన్ ఇండియా ఐఫోన్ 12 అందుబాటులోకి వస్తుందని సంస్ద తెలిపింది.అయితే ఐఫోన్ 12 భారత్ లో నే తయారవ్వడంతో 22 శాతం మేర దిగుమతి పన్నులు తగ్గుతాయి.

అంతేకాదు నిరుద్యోగులకు ఈ సంస్ద ద్వారా ఉద్యోగావకాశాలు పెరగనున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube