పోటెత్తిన బహుమతులు... ఇప్పుడు బయటపెట్టిన ట్రంప్

ఎన్నో నాటకీయ పరిణామాలకు వేదికగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠను కలిగించిన అమెరికా నూతన అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమం పూర్తయ్యింది.జో బైడెన్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడంతో పాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ నుంచి ఫ్లోరిడాలోని తన సొంత రిసార్టు వెళ్లిపోయారు.

 Apple Ceo Tim Cook Gifts Trump Max Pro Reveals Financial Report, Donald Trump Fi-TeluguStop.com

అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ట్రంప్‌ తీసుకున్న పలు నిర్ణయాలు ఆయన స్థాయిని పెంచితే.మరికొన్ని మాత్రం అధ్యక్ష పదవికి డొనాల్డ్ ట్రంప్ అనర్హుడనే మచ్చ తెచ్చాయి.

ట్రంప్ నిర్ణయాలను సమర్ధించిన వారి కంటే.వ్యతిరేకించిన వారే ఎక్కువ.

వీటిని సవాలు చేస్తూ పౌర సమాజంతో పాటు కంపెనీలు, స్వచ్ఛంద సంస్థలు కోర్టులను ఆశ్రయించడంతో న్యాయస్థానాల చేతుల్లో ట్రంప్ చివాట్లు తిన్నారు.చివరికి అధ్యక్షుడిగా దిగడానికి నెల రోజుల ముందు కూడా ఆయనకు మొట్టికాయలు తప్పలేదు.

ఈ నాలుగేళ్ల కాలంలో వీసా విధానంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను గూగుల్‌, యాపిల్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థలు వ్యతిరేకించి కోర్టు మెట్లెక్కాయి.మరి అంతలా వ్యతిరేకించిన ఆయా కంపెనీల యాజమాన్యాలు ట్రంప్‌ను బహుమతులతో ముంచెత్తాయట.

ఈ విషయాన్ని స్వయంగా ట్రంప్.తన ఫైనాన్షియల్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

తాను అధ్యక్షుడిగా ఉన్నకాలంలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్‌ కుక్ ఒక గిఫ్ట్‌ ఇచ్చారని ట్రంప్ చెప్పారు.

Telugu Appleceo, Donald Trump, Donaldtrump, Mac Pro-Telugu NRI

దాదాపు 5,999 డాలర్లు విలువ చేసే మాక్‌ ప్రో కంప్యూటర్‌ను కుక్ నుంచి బహుమతిగా అందుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.దీన్ని టెక్సాస్‌ రాజధాని ఆస్టిన్‌లో ఉన్న యాపిల్‌ ఫ్లెక్స్ ఫ్యాక్టరీలో తయారుచేసినట్లు ట్రంప్ వెల్లడించారు.అయితే దీన్ని ట్రంప్‌కు టిమ్‌ ఎప్పుడు బహూకరించారనేది మాత్రం ఆయన ప్రస్తావించలేదు.

యాపిల్‌ తో పాటు ప్రఖ్యాత విమాన తయారీ సంస్థ బోయింగ్, కార్ మాన్యుఫాక్చరింగ్ సంస్థ ఫోర్డ్ లు కూడా ట్రంప్‌కు బహుమతులు ఇచ్చాయి.

ఫోర్డ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌ బిల్ ఫోర్డ్ ఒక లెదర్‌ జాకెట్, బోయింగ్ ప్రెసిడెంట్ డెన్నిస్‌ ములెన్‌బర్గ్‌ కస్టమైజ్డ్‌ గోల్ఫ్ క్లబ్‌ను బహుమతిగా ఇచ్చారట.

అయితే ట్రంప్‌కు వచ్చిన బహుమతుల్లో అత్యంత ఖరీదైనది మాత్రం కాంస్యంతో తయారు చేసిన యుఎస్‌ మెరైన్స్‌ విగ్రహం.దీన్ని గ్రేటెస్ట్ జనరేషన్స్‌ ఫౌండేషన్‌ సీఈవో తిమోతి డేవిస్‌ బహూకరించారట.

దీని విలువ 25,970 డాలర్లు.వీటితో పాటు ఛాంపియన్‌షిప్‌ బెల్ట్‌, నేషనల్‌ మెమోరియల్‌ కాంస్య విగ్రహం, గోల్ఫ్‌ క్లబ్ కవర్‌, చేతి గ్లోజ్‌, గోల్ఫ్ బ్యాగ్, గొడుగు ఈ బహుమతుల జాబితాలో ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube