స్టీరింగ్‌లెస్ కారు తీసుకొస్తున్న యాపిల్.. దీని ప్రత్యేకతలు తెలిస్తే!

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్‌ కార్లు మంచి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి.వినియోగదారులు శిలాజ ఇంధనాలతో నడిచే కార్లకు బదులుగా ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

 Apple Carrying A Steering Wheelless Car Steering Less, Car,apple Car, Technology-TeluguStop.com

ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ కంపెనీలు అదిరిపోయే ఎలక్ట్రిక్ కార్లను లాంచ్ చేస్తూ వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.స్మార్ట్‌ఫోన్‌ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్‌ కార్లను తయారు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కూడా ఒక ఎలక్ట్రిక్ కారు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తోంది.2025 నాటికి టైటాన్‌ అనే ఓ ఎలక్ట్రిక్‌ కారును యాపిల్‌ లాంచ్ చేయాలని ప్లాన్ చేసినట్లు సమాచారం.

2014 నుంచే యాపిల్‌ ‘ప్రాజెక్ట్‌ టైటాన్‌‘ పేరుతో ఎలక్ట్రిక్‌ కార్ల తయారీపై దృష్టి పెట్టింది.కానీ అంతర్గత కలహాలు, నాయకత్వ లోపాల వల్ల ఎలక్ట్రిక్‌ కార్లను ఇప్పటివరకు తీసుకురాలేకపోయింది యాపిల్ సంస్థ.

అయితే ఈ సమస్యలన్నీ తొలగిపోయిన తర్వాత యాపిల్‌ సంస్థ ప్రస్తుతం ఎలక్ట్రిక్ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లను తీసుకు వచ్చే పనిలో పడిందని తెలుస్తోంది.

యాపిల్‌ కారు ప్రత్యేకతలు

Telugu Apple Car, Project Titan-Latest News - Telugu

యాపిల్‌ ఎలక్ట్రిక్‌ కార్‌ టైటాన్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ ఫీచర్ తో లాంచ్ అవుతుంది.ఐఫోన్ టచ్ స్క్రీన్, వాయిస్ కంట్రోల్ ఫంక్షన్లను ఉపయోగించి కారు పార్క్ అవుతుంది.విశేషమేంటంటే, ఈ యాపిల్‌ కారుకు వీల్స్‌, పెడల్స్‌, స్టీరింగ్ కూడా ఉండవట.

హ్యాండ్స్ ఫ్రీ డ్రైవింగ్‌పై దృష్టి పెట్టి స్టీరింగ్ లెస్ కారు తీసుకురావాలని యాపిల్ సంస్థ భావిస్తోంది.అయితే అత్యవసర పరిస్థితిలో కారును మలుపు తిప్పేందుకు వాహనదారులకు వీలుగా ఒక స్టీరింగ్ ఇచ్చే అవకాశం ఉందని మరి కొన్ని కథనాలు పేర్కొంటున్నాయి.

ఏది ఏమైనా స్టీరింగ్ లేని కారు ఇప్పటివరకు రాలేదు.యాపిల్ ఇలాంటి టెక్నాలజీని తీసుకొస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube