టెక్ దిగ్గజం యాపిల్ తన AirPods కొత్త వెర్షన్‌ను 3వ తరం AirPods పేరుతో 2021లో కొత్త ఐఫోన్లతో పాటుగా విడుదల చేసింది.ఈ కొత్త ఎయిర్‌పాడ్స్ లాస్ట్ వెర్షన్ వలె పెద్దగా పాపులర్ కాలేదు.
ఎందుకంటే వాటిలో కొత్తగా అప్‌డేట్స్ ఏమీ ఇవ్వలేదు.అంతేకాదు, ఈ ఎయిర్‌పాడ్స్ ప్రో వేరియంట్ కంటే ఖరీదైనవి కూడా.అయితే అవి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో అతి తక్కువ ధర రూ.249కే దొరుకుతున్నాయి.ఇవి రూ.20,900 ధరతో లాంచ్ కాగా ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో మాత్రం రూ.249కే లభిస్తున్నాయి.అయితే ఈ ధరకు వీటిని సొంతం చేసుకోవాలంటే రెండు ఆఫర్లు ఉపయోగించుకోవాల్సి ఉంది.

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌లో మీరు కొత్త Apple AirPods 3ని అతి తక్కువ ధర రూ.249కి కొనుగోలు చేయవచ్చు.ఫ్లిప్‌కార్ట్ వీటిని రూ.18,999కి అమ్ముతోంది.అయితే మీరు మీ ఓల్డ్ ఫోన్‌ని ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్స్ఛేంజ్ చేసుకుంటే, మీరు 17,500 రూపాయల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు.
అప్పుడు దీని ధర 1,499 రూపాయలకు తగ్గుతుంది.మీరు ఫెడరల్ బ్యాంక్ లేదా HSBC క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగిస్తే, రూ.1,250 రూపాయల వరకు ఎక్స్‌ట్రా డిస్కౌంట్‌ను కూడా పొందవచ్చు.ఈ డిస్కౌంట్ తర్వాత యాపిల్ థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్ రూ.249 ధరకే దిగి వస్తాయి.

ఈ కొత్త ఎయిర్‌పాడ్స్ H1 చిప్ అని పిలిచే స్పెషల్ చిప్ సాయంతో పనిచేస్తాయి.వీటిలో స్పేషియల్ ఆడియో సపోర్ట్ అనే ఫీచర్ కూడా ఉంది.కొత్త ఎయిర్‌పాడ్స్ ఎయిర్‌పాడ్స్ ప్రో మాదిరిగానే ఉంటాయి కానీ వాటిలో సిలికాన్ టిప్స్ ఉండవు.అయితే కొత్త ఛార్జింగ్ కేస్ మాత్రం ఉంటుంది.ఓల్డ్ ఫోన్ ఇచ్చేసి అద్భుతమైన ఎయిర్‌పాడ్స్ సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఆఫర్స్ ఉత్తమంగా నిలుస్తాయి.