భారీ సంఖ్యలో చైనా గేమింగ్ యాప్ లని తొలగించిన యాపిల్

కరోనా మహమ్మారి వైరస్ చైనా నుంచి దిగుమతి అయ్యిందని, దానిని ప్రపంచ దేశాల మీదకి వారు బయో వెపన్ గా వదిలారని చాలా దేశాలు నమ్ముతున్నాయి.అయితే ఈ విషయాన్ని పక్కదారి పట్టించడానికి చైనా ప్రభుత్వం భారత్ ని రెచ్చగొడుతూ కరోనా నుంచి ప్రపంచ దృష్టిని మార్చే ప్రయత్నం చేస్తుంది.

 Apple Removes Over 4500 Games, China App Store, China Apps, Apple Company, Coron-TeluguStop.com

అందులో భాగంగానే గాల్వాన్ వ్యాలీలో 20 మంది భారతీయుల మీద కిరాతకంగా దాడి చేసి చైనా సైనికులు హత్య చేశారు.అయితే ఈ దుశ్చర్య చైనాని ప్రపంచ దేశాల ముందు మరింత దోషిగా నిలబెట్టింది.

ఇండియాలో ప్రజల ఆగ్రహానికి గురై ఇప్పుడు ఆ దేశ మార్కెట్ మీద పడింది.భారత్ మార్కెట్ లో పెత్తనం చేస్తూ వేల కోట్లు ఆర్జిస్తున్న చైనా యాప్ లని భారత్ ప్రభుత్వం నిషేధించింది.

దీంతో ఆ దేశం సుమారు 45 వేల కోట్ల రూపాయిలు నష్టపోయింది.

ఇదే దారిలో అమెరికాతో పాటు ఇతర దేశాలు కూడా వెళ్తున్నాయి.

దేశీయ భద్రతని దృష్టిలో పెట్టుకొని ఆ దేశ యాప్ లని నిషేధించాలని భావిస్తున్నాయి.మరో వైపు తాజాగా చైనా యాప్‌ స్టోర్‌లోని చైనాకి చెందిన 4,500 మొబైల్‌ గేమ్స్‌ను తొలగిస్తూ యాపిల్‌ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది.

కేవలం మూడు రోజుల వ్యవధిలో యాపిల్‌ ఇంత భారీగా యాప్‌లను తొలగించింది.మొబైల్ గేమింగ్‌ లైసెన్స్‌ నింబంధనల్లో యాపిల్ పలు సంస్కరణలకు చేపట్టింది.

ఇందులో భాగంగానే యాపిల్‌ చైనా గేమ్స్‌ను‌ తొలగించింది.చట్టపరమైన అనుమతి లేని గేమ్స్‌ ను తాము ఉండనివ్వబోమని తేల్చి చెప్పింది.

ఈ దెబ్బతో చైనా డిజిటల్ కమ్యునికేషన్ సంస్థలు వేల కోట్ల రూపాయిలు నష్టపోనున్నట్లు తెలుస్తుంది.వరుసగా తగులుతున్న దెబ్బలకి చైనా ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube