తల్లిదండ్రులకు విజ్ఞప్తి : పిల్లలపై ప్రేమతో ఆ తల్లిలా మీరు కడుపుకోత మిగుల్చుకోవద్దు

ప్రతి తల్లికి తన పిల్లలు అంటే అమితమైన ప్రేమ ఉంటుంది.వారికి పూర్తి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో ప్రతి విషయంలో కూడా నూటికి నూరు పాళ్లు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.

 A Appeal To Parents About Giving Syrups For Children ,health Tips In Telugu, Vir-TeluguStop.com

ఎన్నో విధాలుగా తల్లిదండ్రులు పిల్లలకు సపర్యలు చేస్తూ ఉంటారు.ఎన్ని చేసినా కూడా ఏదో ఒక సమయంలో అనారోగ్యం బారిన పడుతూనే ఉంటారు.

అలాంటి సమయంలో పిల్లలకు సిరప్స్‌ తాపించాల్సి ఉంటుంది.కొందరు పిల్లలు సిరప్స్‌ను ఇష్టంగా తాగితే కొందరు మాత్రం అస్సలు సిరప్స్‌ తాగేందుకు ఇష్టపడరు.

అలాంటి సమయంలో తల్లిదండ్రులు వారితో సిరప్స్‌ తాగించేందుకు కొట్టడం లేదంటే మరేదైనా ప్రయత్నం చేస్తూ ఉంటారు.

ఇటీవల యూపీకి చెందిన ఒక మహిళ తన నలుగురు పిల్లలు కూడా ఒకరి ద్వారా ఒకరికి జలుబు మరియు దగ్గు రావడంతో వారికి సిరప్‌ తాపించేందుకు ప్రయత్నించింది.

కాని వారు ఎవరు కూడా సిరప్‌ తాగేందుకు ఇష్టపడలేదు.బలవంతంగా తాపించినా కూడా కక్కేవారు.దాంతో ఆమె తీవ్ర అసహనంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేసి కొట్టడం కూడా జరిగింది.వారి దగ్గు తగ్గక పోవడంతో ఏం చేయాలో ఆమెకు పాలుపోలేదు.

దాంతో ప్రతి రోజు రాత్రి వారు పడుకునే ముందు పాలు తాగుతారు.ఆ పాలల్లో దగ్గు సిరప్‌ను కలిపి ఇచ్చేసింది.

Telugu Appeal, Appeal Syrups, Tips Telugu, Telugu Ups-General-Telugu

పాలల్లో సిరప్‌ ఉన్న విషయాన్ని గుర్తించకుండా పిల్లలు నలుగురు కూడా ఆ పాలను తాగేశారు.అలా రెండు మూడు రోజులు చేస్తే ఖచ్చితంగా దగ్గు తగ్గుతుంది అనుకుంది.తెల్లారి ఉదయం పిల్లలను ఎంత లేపినా లేవలేదు.వారు శ్వాస తీసుకోవడం కూడా లేదు.పిల్లల్లో ఉలుకు పలుకు లేకపోవడంతో షాక్‌ అయిన ఆ తల్లి వెంటనే వైధ్యుల వద్దకు తీసుకు వెళ్లగా ఆ నలుగురు పిల్లలు మృతి చెందినట్లుగా వైధ్యులు నిర్థారించారు.

Telugu Appeal, Appeal Syrups, Tips Telugu, Telugu Ups-General-Telugu

కెమికల్‌ అయిన సిరప్‌ను పాలల్లో కలిపి ఇవ్వడం వల్ల అది విషం అయ్యిందని, ఆ విషం కాస్త పిల్లలపై తీవ్ర ప్రభావం చూపించి వారు చనిపోయినట్లుగా డాక్టర్లు చెప్పారు.డాక్టర్లు చెప్పిన ఆ విషయం విన్న తర్వాత ఒక్కసారిగా ఆ తల్లి కుప్పకూలిపోయింది.తన నలుగురు పిల్లలను తాను స్వయంగా చేతితో విషం ఇచ్చి చంపుకున్నాను అంటూ బోరు బోరున ఏడ్చేసింది.

ఎంత ఏడ్చినా ఏం ప్రయోజనం.పిల్లలపై ప్రేమతో ఆమె చేసిన పని ఆమెకే శాపం అయ్యింది.

ఎలాంటి సిరప్స్‌ కూడా పిల్లలకు పాలతో కలిపి ఇవ్వొద్దు.పాలు తాగిన 10 నుండి 20 నిమిషాలకు కాని సిరప్స్‌ పోయాలి.

అలాగే సిరప్స్‌ తాగిన అర్థ గంట వరకు పాలను ఇవ్వొద్దు.ఈ చిన్న విషయాన్ని గుర్తు పెట్టుకోండి.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం.ఈ విషయాన్ని నలుగురితో షేర్‌ చేసి పిల్లల జీవితాలను కాపాడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube