డీప్ న్యూడ్ యాప్ కలకలం....ఇది ఎంత డేంజరో తెలుసా

ముఖ కవళికలని మార్చేసి మాట్లాడని వాటిని మాట్లాడినట్లుగా చూపించే టెక్నాలజీ డీప్ ఫెక్స్ గత కొన్నేళ్లుగా ఈ టెక్నాలజి పలు వివాదాలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే.అయితే ఇప్పుడు తాజాగా మరో టెక్నాలజీ ఒకటి వచ్చింది.

 App Can Create Un Draped Women Image-TeluguStop.com

అయితే ఈ టెక్నాలజీ తో మేలు కన్నా కీడే ఎక్కువ జరగనున్నట్లు అర్ధం అవుతుంది.ఆ నూతన టెక్నాలజీయే ‘డీప్ న్యూడ్’, ఇది ఒక అప్లికేషన్.

అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ తో పనిచేసే ఈ యాప్ లో ఫోటో అప్ లోడ్ చేసి ఒక్క క్లిక్ చేస్తే చాలు ఆ ఫోటోలో ఉన్న వారి దుస్తులు మాయమైపోతాయట.అసలు దుస్తులు లేకుండా ఫోటో లు దిగారు అన్న రేంజ్ లో ఫోటో లో ఉన్న వారు నగ్నంగా కనిపిస్తారట.

అయితే ఈ యాప్ కేవలం ఆడవాళ్ల ఫోటోలకు మాత్రమే పనిచేస్తుందట.దీనితో ఇప్పుడు మహిళల్లో,అమ్మాయిలలో తీవ్ర కలవరం మొదలైంది.

ఇప్పటికే మార్ఫింగ్ ఫోటో లతో సోషల్ మీడియా లో పలువురు మహిళలు,అమ్మాయిలు సవాళ్ళను ఎదుర్కొంటుండగా,ఇప్పుడు ఈ కొత్త టెక్నాలజీ కారణంగా మహిళలకు మరింత కీడే జరుగుతుంది అన్న విషయం అర్ధం అవుతుంది.గత నెలలో ఈ డీప్‌న్యూడ్ వెబ్‌సైట్ లాంచ్ అవ్వగా ఆ తర్వాత యాప్‌ను సదరు కంపెనీ రిలీజ్ చేసింది.

అయితే పెయిడ్ వర్షన్ ధర 50 డాలర్లు కాగా ఈ యాప్‌ను ఇప్పటివరకు ఎంతమంది డౌన్‌లోడ్ చేసుకున్నారో తెలియదు కానీ ఈ యాప్ వల్ల అమ్మాయిలకు ముప్పు తప్పదన్న వాదన వినిపిస్తుంది.

ఇప్పటికే ఫోటోలను, వీడియోలను మార్ఫ్ చేసి అమ్మాయిల్ని లోబర్చుకునే కీచకులు ఉన్న ఈ సమాజంలో ఇప్పుడు ఈ డీప్ న్యూడ్ టెక్నాలజీని ఉపయోగించి ఆ కీచకులకు ఆ పని మరింత సులభతరం చేయనుంది.

కావున ఈ యాప్ తయారు చేయడంపై అనేక వర్గాల్లో కలవరం రేగుతోంది.ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ యాప్ ను సదరు సంస్థ ఆపేసినట్లు తెలుస్తుంది.ఎవరైనా మహిళల ఫోటోలను నగ్నంగా మార్చేసే అవకాశం ఉందని, పోర్న్‌ను ప్రోత్సహించేలా ఉందన్న ఆందోళన కనిపిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థ కూడా ఈ యాప్ ని ఆపేసినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube