గల్ఫ్ కంట్రీస్ లో పని చేసుకుంటే తమ రాష్ట్రాల కంటే కూడా ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు అనుకునే వారు ఎంతో మంది విదేశాలు వెళ్లి అక్కడ సరైన దారి చూపించే వారు లేక ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు.ముఖ్యంగా ఏపీ నుంచీ ఎంతో మంది గల్ఫ్ వెళ్లి జీవనోపాది పొందుతున్నారు కూడా.ఈ క్రమంలోనే అధిక సంఖ్యలో మహిళలు సైతం గల్ఫ్ వెళ్తున్నారు అయితే కొంతమంది నకిలీ ఏజెంట్ల వలన మోసపోతూ అక్కడ అరబ్బ్ షేక్ లు పెట్టె హింసలకి లోనవుతున్నారు.వెళ్ళే వరకూ ఒక ఉద్యోగం పేరు చెప్పి వెళ్ళిన తరువాత పాచి పని చేయిస్తున్నారు.
ఈ తరుణంలోనే ఏపీ ప్రభుత్వం గల్ఫ్ వెళ్ళే మహిళలకి రక్షణ కలిపించాలని సంకల్పించింది.
ఏటా 5 వేల మందికి పైగా మహిళలు ఏజెంట్ల మోసాలకు బలై పోతున్నారు.ఈ దారుణాలు మోసాలు ఇక గల్ఫ్ వెళ్ళే ఏపీ మహిళలకి జరుగకూడదు అని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.గల్ఫ్ వెళ్ళే మహిళల కోసం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ నడుం బిగించింది.
విదేశీ మంత్రిత్వ శాఖ సూచనల మేరకు.అధికారికంగా ఉద్యోగాలతో కూడిన వీసాతో గల్ఫ్ దేశాలకు పంపించడం ద్వారా మహిళలకు భద్రత కల్పించేలా కార్యాచరణ రూపొందించింది…ఈ క్రమంలోనే ఏపీ ప్రవాస తెలుగు సంస్థ(ఏపీ ఎన్‌ఆర్‌టీ) సహకారం తీసుకుంది.
అంతేకాదు వారి సహకారంతో పాటుగా అలాగే “ఓం క్యాప్” అనే సంస్థతో కూడా ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.అంతేకాదు నర్సు ఉద్యోగాలకూ 500 మంది కావాలని ఓంక్యా్‌పను గల్ఫ్‌లోని సంస్థలు కోరాయి.
రంజాన్ తర్వాత ఆహ్వానాలు అందే అవకాశం ఉంది.ఆ.అంతేకాదు పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకున్నవారితోనూ.పాసుపోర్టు ఉన్న వారితో ఈ నెల 19 నుంచి 29 వరకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు .
ఆడవారికి బద్రత ఎలా అంటే
ఓం క్యాప్ అనే సంస్థ తో ఒప్పందం చేసుకున్న తరువాత.ఆ సంస్థ అధికారికంగా గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలపై సమాచారం ఇస్తుంది.
వారితో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటుంది.వారి క్షేమ సమాచారం తెలుసుకుంటూ ఉంటుంది.అంతేకాదు
అక్కడి యజమాన్యాలతోనూ, సంస్థలతోనూ ఓంక్యాప్ ఒప్పందం చేసుకుంటుంది.అధికారికంగా ఉద్యోగ భర్తీ చేపడుతుంది…ఫలితంగా మహిళలు చట్టపరంగా పాస్‌పోర్టులూ, వీసాలతో గల్ఫ్ దేశాలకు వెళతారు.అక్కడి చట్టాల నుంచి రక్షణ పొందుతారు.అంతేకాదు అక్కడ యజమానులు చిత్రహింసలకు గురిచేయకుండా వీరికి చట్టపరంగా భద్రత ఉంటుంది.