ఏంటేంటి ? వాలంటీర్లు జగన్ ను ఇబ్బందిపెట్టేస్తున్నారా ?  

Ap Grama Volunteer\'s Praises To Cm Ys Jagan-help In People,pentions To Direct To People,ration

ప్రజలకు చేరువగా ప్రభుత్వ పథకాలను అందించాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ వలంటీర్ల వ్యవస్థకు తెరలేపాడు.వీరి ద్వారా ప్రభుత్వ పథకాలన్నింటినీ ప్రజల వద్దకే అందించాలని సీఎం జగన్ చూస్తున్నాడు.ఇప్పటికే వారి నియామకాలను పూర్తిచేశారు...

Ap Grama Volunteer\'s Praises To Cm Ys Jagan-help In People,pentions To Direct To People,ration-AP Grama Volunteer's Praises To CM YS Jagan-Help In People Pentions Direct Ration

ప్రతి యాభై ఇళ్లకు ఒకరు చొప్పున వాలంటీర్లను ప్రభుత్వం నియమించింది.ఈ విధంగా గ్రామ, పట్టణాల్లో కలిపి రెండు లక్షల అరవై తొమ్మిది వాలంటీర్ల పోస్టులు మంజూరు చేశారు.వీరంతా ఇప్పటికే నియామక పత్రాలు అందుకుని తమకు కేటాయించిన ఇళ్లల్లోని వారిని పరిచయం చేసుకునే పనిలో పడ్డారు.

అయితే అధికారికంగా వారంతా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి అంటే రేపటి నుంచే విధుల్లో చేరబోతున్నారు.ప్రభుత్వం సూచించిన విధంగా వీరంతా ప్రభుత్వ పథకాలను ఇంటింటికి డోర్ డెలివరీ చేయబోతున్నారు.పెన్షన్లు, రేషన్ బియ్యం వంటి 30కి పైగా ప్రభుత్వ పథకాలు వారి చేతుల మీదుగానే.పంపిణీ చేసేందుకు అంతా సిద్ధం చేశారు.

Ap Grama Volunteer\'s Praises To Cm Ys Jagan-help In People,pentions To Direct To People,ration-AP Grama Volunteer's Praises To CM YS Jagan-Help In People Pentions Direct Ration

అయితే ఈ వలంటీర్ల వ్యవస్థ పూర్తిగా గందరగోళంగా తయారయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది.ఎందుకంటే ఇప్పటికే వాలంటీర్లుగా ఎంపికైన వారిలో సుమారు ఇరవై వేల మంది నియామక పత్రాలు తీసుకోలేదు.అలాగే నియామక పత్రాలు అందుకున్నవారిలో చాలా మంది దూరంగా ఉంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.దీనంతటికి కారణం పూర్తి స్థాయిలో పని చేయాలనే నిబంధన పెట్టడమేనట.

వాలంటీర్లుగా చేరిన వారు చదువులు కానీ, ఇతర ప్రవేట్ ఉద్యోగాలు కానీ చేయకూడదనే నిబంధన పెట్టడంతో పాటు అఫిడవిట్ తీసుకోవడంతోనే అసలు చిక్కొచ్చిందట.అనేక మంది విధుల్లో చేరేందుకు.నిరాకరిస్తున్నారు...

వేరే ఉద్యోగాలు, ఉపాధి పొందే వాళ్లు, చదువుకునే వాళ్లు మొత్తం వదిలేసి కేవలం ఐదు వేలకు పని చేయడానికి ఇష్టపడడంలేదట.దీంతో పాటు సోషల్ మీడియాలో వాలంటీర్లను చులకన చేస్తూ అనేక వ్యంగ్యాస్థ్రాలు ట్రోల్ అవుతుండడం కూడా ఒక కారణంగా తెలుస్తోంది.

వేతనం తక్కువ, పని ఎక్కువ అన్నట్టుగా వీరి ఉద్యోగాలు ఉండే అవకాశం ఉండడంతో దీని కోసమే సమయం మొత్తం వెచ్చించేందుకు చాలామంది వెనకడుగు వేస్తున్నట్టు కనిపిస్తోంది.ఈ ఉద్యోగాల్లో చేరిన వారిలో చాలామంది వైసీపీకి చెందినవారే అయినా ఈ విధులు చేయడానికి ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారట.

అందుకే ఇప్పుడు చేరని వారు మాత్రమే కాదు విధుల్లో చేరినప్పటికీ తరువాత డ్రాప్ అయ్యేవారి సంఖ్య ఎక్కువగా ఉండొచ్చనేది అందరూ ఊహిస్తున్న పరిణామం.దీని కారణంగా మళ్లీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాలంటీర్లను భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది.కానీ అసలు గందరగోళం ఇప్పటి వరకూ ఆ ప్రభుత్వ పథకాలు పంపిణీ చేసిన ఉద్యోగులు వాలంటీర్ల మధ్య వచ్చే అవకాశం కనిపిస్తోంది...

ప్రభుత్వ పధకాలను ప్రజలకు అందించే సమయంలో వారి నుంచి కూడా రకరకాల ఫిర్యాదులు వస్తూ ఉంటాయి.ఈ సమస్యలన్నిటినీ ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారే అవకాశం లేకపోలేదని ఆ పార్టీ నాయకులే ఆందోళన చెందుతున్నారు.