పబ్‌జీ పనైపోయింది... ఇప్పుడు ఓ కొత్త గేమ్‌ వచ్చింది, ఒక్క రోజులో కోటి మందికి నచ్చేసింది  

Apex Legends Creates New Trend In Gaming-pubg,trend In Gaming

మారిన టెక్నాలజీ, పరిస్థితుల నేపథ్యంలో ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో కూడా స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న వారు ఏమైనా ఖాళీగా ఉంటారా, పని వదిలేసి మరీ అందులో ఉన్న గేమ్స్‌ను తెగ ఆడేస్తున్నారు. బ్రౌజింగ్‌ కంటే ఈమద్య కాలంలో గేమింగ్‌కే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు..

పబ్‌జీ పనైపోయింది... ఇప్పుడు ఓ కొత్త గేమ్‌ వచ్చింది, ఒక్క రోజులో కోటి మందికి నచ్చేసింది-Apex Legends Creates New Trend In Gaming

ప్రతి ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో కొన్ని నెలల క్రితం క్యాండీ క్రష్‌ గ్రేమ్‌ ఉండేది. ఆ గేమ్‌ మత్తులో జనాలు ఏ స్థాయిలో పడ్డారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత మరో గేమ్‌ వచ్చింది.

ఆ గేమ్‌ అత్యంత హింసాత్మకంగా ఉందని, జనాలు ఆత్మహత్యకు పురిగొల్పే విధంగా ఉంది అంటూ విమర్శలు రావడంతో అది కనిపించకుండా పోయింది. ఆ తర్వాత పబ్‌జీ గేమ్‌ తెగ సందడి చేస్తోంది.

గత కొన్ని నెలలుగా పబ్‌ జీ గేమ్‌ పై ఏ స్థాయిలో సోషల్‌ మీడియాలో చర్చలు జరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

పబ్‌ జీ గేమ్‌ కోసం హత్యలు కూడా జరుగుతున్నాయి. ఇంతటి ప్రాచుర్యం పొందిన పబ్‌ జీ గేమ్‌ ఔట్‌ డేటెడ్‌ అవ్వబోతుంది. పబ్‌ జీని తలదన్నేలా అపెక్స్‌ లెజెండ్స్‌ అనే గేమ్‌ వచ్చింది.

ప్రస్తుతం డెస్ట్‌ టాప్‌ వర్షన్‌లో మాత్రమే వచ్చిన అపెక్స్‌ లెజెండ్స్‌ గేమ్‌ అతి త్వరలోనే మొబైల్‌ వర్షన్‌ రాబోతుంది. ఈ గేమ్‌ ఫిబ్రవరి 5న ప్రారంభం అవ్వగా కేవలం మూడు రోజుల్లో కోటి మందికి పైగా డౌన్‌ లోడ్‌ చేసుకుని సబ్‌ స్క్రైబ్‌ అయ్యారు.

వారం రోజుల్లో రెండున్న కోట్ల మంది ఈ గేమ్‌ను ఆడేందుకు సిద్దం అయ్యారు. ఎప్పుడు కూడా నాలుగు నుండి పది లక్షల మంది ఆన్‌లైన్‌లో ఉంటున్నట్లుగా సదరు కంపెనీ ప్రకటించింది

పబ్‌ జీ కంటే ఈ గేమ్‌ అత్యంత ఆసక్తికరంగా ఉందని, టాస్క్‌లు కూడా చాలా బాగున్నాయంటూ ఆడుతున్న వారు రివ్యూలు రాస్తున్నారు. దాంతో అపెక్స్‌ లెజెండ్స్‌ మొబైల్‌ వర్షన్‌ వస్తే పబ్‌ జీ కనిపించకుండా పోవడం ఖాయం అంటూ గేమింగ్‌ నిపుణులు అంటున్నారు..

దాదాపు ఆరు నెలల పాటు పబ్‌ జీ సృష్టించిన సందడికి రెండు మూడు నెలల్లో బ్రేక్‌ పడటం ఖాయం అనిపిస్తుంది. అపెక్ట్‌ లెజెండ్స్‌ మీరు డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే డెస్క్‌టాప్‌ లో ముందు స్టూడియో రెస్పాన్‌ ఎంటర్‌ టైన్‌ మెంట్‌ లో మీరు లాగిన్‌ అవ్వండి. ఆ తర్వాత గేమ్‌ డౌన్‌ లోడ్‌ చేసుకోవచ్చు.

ఏ గేమ్‌ అయినా అతిగా ఆడితే, అందులో ఇన్వాల్వ్‌ అయితే ప్రమాదమే. అందుకే సరదాగా ఆడుకోండి తప్ప మరీ ఇన్వాల్వ్‌ మాత్రం అవ్వకండి.

ఈ కొత్త గేమ్‌ గురించి మీ స్నేహితులతో షేర్‌ చేసుకోండి.