జగన్ కోటి రూపాయిల ఆఫర్ కి చంద్రబాబుకి మరో సారి స్ట్రోక్  

త్రాగునీటి ఎద్దడి నివారణకి నియోజకవర్గానికి కోటి ఇస్తా అన్న జగన్. .

Ap Cm Jagan Announce Once Crore Rupees To Every Mla-ap Government,ap Politics,mla,reduce Water Problem,tdp,ysrcp

వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ, ముఖ్యంగా నవరత్నాలు అన్నింటిని కూడా ఆచరణలోకి తీసుకొస్తూ తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పార్టీలకి అతీతంగా సంక్షేమ పథకాలు అందరికి అందే విధంగా ప్రణాళికలు వేస్తూ అధికారులకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తూ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక తాజాగా అసెంబ్లీ సమావేశాలలో మరోసారి జగన్ సంచలన ప్రకటన చేసారు..

జగన్ కోటి రూపాయిల ఆఫర్ కి చంద్రబాబుకి మరో సారి స్ట్రోక్-AP CM Jagan Announce Once Crore Rupees To Every MLA

ఇక జగన్ ప్రకటనకి టీడీపీ నేథలకి కనీసం నోట మాట రాలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తల హత్యల గురించి తప్ప సంక్షేమంపై వేలు చూపించాలేకపోతున్న టీడీపీకి జగన్ ఇచ్చిన హామీ మరో సారి సైలెంట్ అయ్యేళా చేసింది. రాష్ట్రంలో ముఖ్యంగా గ్రామాలలో నెలకొన్న త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి బృహత్తర కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పిన జగన్, దాని కోసం అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకి కోటి రూపాయిల చొప్పున ఇస్తానని, ఆ నిధులతో నియోజకవర్గాలలో త్రాగునీటి సమస్యలు లేకుండా చేయాల్సిన పూర్తి బాద్యత ఎమ్మెల్యేల మీదనే ఉందని చెప్పారు.

అయితే ఈ కోటి రూపాయిలు కేవలం వైసీపీ ఎమ్మెల్యేలకి మాత్రమే కాకుండా టీడీపీ ఎమ్మెల్యేలకి కూడా ఇస్తానని చెప్పి జగన్ షాక్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్ళలో త్రాగునీటి సమస్యలు అధికమించడానికి ఎలాంటి ప్రణాళికలు చేయలేదని, తాను మాత్రం ఇప్పటి నుంచి అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేసి రానున్న రోజులలో త్రాగునీటి సమస్యలు లేకుండా పరిష్కారం చేసేందుకు సిద్ధం అయినట్లు స్పష్టం చేసారు.