జగన్ క్యాబినెట్ కు సర్వం సిద్ధం... ప్రమాణస్వీకారానికి సిద్దమౌతున్న 25 మంది మంత్రులు  

Apcm Cabinet Is Ready 25 Ministers Take Oath Today1-ap Sachivalayam,cabinet Meeting,dgp Gautham Sawang,jagan Mohan Reddy,ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి,డీజీపీ గౌతం సవాంగ్‌

ఏపీ సి ఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ నిర్మాణానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ రోజు ఉదయం 11:49 నిమిషాలకు 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం 8 గంటల 34 నిమిషాలకు జగన్ సచివాలయానికి చేరుకున్నారు. అయితే సమయం లేనందున ఆయన నేరుగా మొదటి బ్లాక్ లోని ఆయన ఛాంబర్ కు వెళ్లి సర్వమత ప్రార్ధనలు నిర్వహించి అనంతరం 8:50 నిమిషాలకు తన తోలి సంతకం చేయనున్నారు. అయితే అంతా కూడా ముహూర్తం ప్రకారం సీ ఎం జగన్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో ఏపీ సి ఎం ను కలవాలని పలువురు ఉద్యోగులు బయట పడిగాపులు పడుతున్నారు..

జగన్ క్యాబినెట్ కు సర్వం సిద్ధం... ప్రమాణస్వీకారానికి సిద్దమౌతున్న 25 మంది మంత్రులు -Apcm Cabinet Is Ready 25 Ministers Take Oath Today1

తొలుత వారిని కలిసి ఛాంబర్ కి వెళ్లాల్సి ఉండగా, ముహూర్తం దగ్గర పడుతుండడం తో జగన్ వారిని కలవకుండా నే నేరుగా ఛాంబర్ ని వెళ్లిపోయారు. దీనితో ఉద్యోగస్తులు కాసంత నిరాశ కు గురయ్యారు. అయితే తోలి సంతకం అయిన తరువాత జగన్ తిరిగి వారిని కలవనున్నట్లు తెలుస్తుంది.

మరోపక్క మంత్రుల ప్రమాణ స్వీకారానికి అన్నీ ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సచివాలయం ప్రాంగణంలో ఉదయం 11గంటల 49 నిమిషాలకు గవర్నర్ నరసింహన్ ఆ 25 మంది మంత్రుల చేత ప్రమాణం చేయిస్తారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రాంగణాన్ని, ప్రమాణస్వీకార వేదికను వైసీపీ జెండా రంగులతో అలంకరించినట్లు తెలుస్తుంది. అలానే ఈ కార్యక్రమం వీక్షించడానికి వచ్చే ప్రజాప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు, ఉన్నతాధికారులు, ప్రజల కోసం ప్రత్యేక బ్లాకులు ఏర్పాటు చేశారు.అంతేకాకుండా వేసవి దృష్ట్యా సభా ప్రాంగణంలో… ఏసీలు, కూలర్లు ను కూడా అమర్చి భారీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.

అయితే పాసులు ఉన్నవారినే ఈ కార్యక్రమ వీక్షణ కు అనుమతిస్తామన్నారు డీజీపీ గౌతం సవాంగ్‌ తెలిపారు. దాదాపు 6వేల మంది హాజరయ్యే ఈ కార్యక్రామానికి 2 వేల మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు. మరోపక్క వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడికి చేరుకునేలా ట్రాఫిక్‌ డైవర్షన్లు, సైన్‌ బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది.