జగన్‌ నిర్ణయానికి బీజేపీ అభినందనలు

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి నేడు రైతు భరోసా కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లాలో ప్రారంభించిన విషయం తెల్సిందే.రైతు భరోసా పథకంను మొదట వైఎస్సార్‌ రైతు భరోసా పథకంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లారు.

 Apbjp Leaders Appreciate Jagan Mohan Reddy Decission-TeluguStop.com

కాని ఈ పథకం ద్వారా రైతులకు అందిస్తున్న అమౌంట్‌లో కేంద్రం నుండి వస్తున్న నిధులు కూడా ఉన్నాయి కనుక పీఎం పేరును కూడా పథకం పేరులో చేర్చితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అయ్యింది.బీజేపీ నాయకులు పలువురు వైఎస్సార్‌ రైతు భరోసా అంటూ జగన్‌ పెట్టిన పేరుపై విమర్శలు చేశారు.

చివరి నిమిషంలో పేరు మార్చినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.

కేంద్రం నుండి వస్తున్న నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు సాయంకు వైఎస్సార్‌ రైతు భరోసా – పీఎం కిసాన్‌’ అంటూ పేరు పెట్టడం జరిగింది.

ఈ నిర్ణయం పట్ల బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.జగన్‌ పథకం పేరు మార్చడం పట్ల అభినందనలు వ్యక్తం అవుతున్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ మాట్లాడుతూ మోడీ గారు ఇస్తున్న కేంద్ర నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు సాయంకు ఈ పేరు పెట్టడం హర్షనీయం అన్నాడు.కేంద్రం ఇచ్చే నిధులతో పథకాలు ప్రవేశ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వాలు తప్పనిసరిగా ప్రధాని పేరు జత చేయాలంటూ కన్నా డిమాండ్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube