హుజూరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌ని కిష‌న్‌రెడ్డి.. ఆయ‌న్ను ఇరికించేందుకేనా..?

హుజూరాబాద్ ఉప ఎన్నిక అంటే ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రి నోటి ఇదే వినిపిస్తోంది.ఎవ‌రు క‌లిసినా దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు.

 Kishanereddy Who Did Not Give Entry Into Huzurabad Should I Put Him In-TeluguStop.com

ఒక్క తెలంగాణలోనే కాదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే హాట్ టాపిక్‌గా మారింది.ఇక్క‌డ ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌ర‌కీ అర్థం కావ‌ట్లేదు.

దాదాపు ఏ ఎన్నిక‌ల్లో జ‌ర‌గ‌న‌న్ని ట్విస్టులు ఈ ఎన్నిక‌ల్లోనే జ‌రుగుతున్నాయి కావ‌చ్చు.అనుకోని ప‌రిస్థితుల న‌డుమ వ‌చ్చిన ఉప ఎన్నిక‌లు కావ‌డంతో అన్ని పార్టీలు దీన్ని చావోరేవో అన్న‌ట్టుగానే తీసుకుంటున్నాయి.

 Kishanereddy Who Did Not Give Entry Into Huzurabad Should I Put Him In-హుజూరాబాద్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌ని కిష‌న్‌రెడ్డి.. ఆయ‌న్ను ఇరికించేందుకేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒక ర‌కంగా చెప్పాలంటే దీన్ని 2023 ఎన్నిక‌ల‌కు రిహాల్స‌ల్‌లాగానే చూస్తున్నాయి.

అయితే మొద‌టి నుంచి ఇక్క‌డ మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ మీద‌నే అంద‌రి దృష్టి ఉంది.

గ‌త ఆరుసార్లు అప‌జ‌య‌మ‌న్నదే లేకుండా ఆయ‌న గెలుస్తూ వ‌స్తున్నారు.ఆక ఆయన ఇప్పుడు ఆత్మ‌గౌర‌వ బావుటా ఎత్తుకుని టీఆర్ ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు.

దీంతో ఈ పార్టీలో వ‌ర్గ‌పోరు మొద‌లైంది.మొద‌టి నుంచి ఈట‌ల రాజేంద‌ర్‌ను బీజేపీలోకి చేర్చేందుకు కృషి చేసిన కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి ఆ త‌ర్వాత ఆయ‌న విష‌యంలో సైలెంట్ అయిపోయారు.

ఈట‌ల రాజేంద‌ర్‌ను బండి సంజ‌య్‌కు చెక్ పెట్టేందుకే తీసుకొస్తున్నారంటూ పెద్ద ఎత్తున అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది.అయితే ఆ త‌ర్వాత ఈట‌ల బండి సంజ‌య్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టం, బండి కూడా ఈట‌ల కోసం బాగానే ప్ర‌చార బాధ్య‌త‌లు చూసుకోవ‌డంతో కిషన్‌రెడ్డి సైలెంట్ అయ్యారు.

Telugu Bandi Sanjay, By Poll, Central Minster, Etela Rajender, Huzurabad Politics, Kishan Reddy, Telangana Bjp, Ts Politics-Telugu Political News

ఇక ఎలాగూ ఇప్పుడు కేంద్ర మంత్రి కావ‌డంతో ఈట‌ల గెలుపు, ఓట‌ముల బాధ్య‌త‌ల్లోకి ఎంట్రి ఇవ్వ‌కూడ‌ద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.ఎందుకంటే మొద‌టి నుంచి ఈట‌ల గెలుపు బాధ్య‌త‌ల‌ను బండి సంజ‌య్ వ‌ర్గ‌మే చూసుకుంటోంద‌ని ఆయ‌న భావిస్తున్నారు.ఇలాంటి నేప‌థ్యంలో తాను ఎంట్రి గెలిపించేందుకు కృషి చేస్తే ఆ క్రెడిట్ బండి ఖాతాలోకి వెళ్తుంద‌ని భావిస్తున్నారంట‌.ఒక‌వేళ ఈట‌ల ఓడిపోయినా ఆ నింద‌ను బండి మీద మోపి ఆయ‌న ఎఫెక్ట్‌ను పార్టీలో త‌గ్గించ‌వ‌చ్చని కిష‌న్‌రెడ్డి ఆలోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

#Telangana BJP #Etela Rajender #Central Minster #Bandi Sanjay #Huzurabad

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు