పెద్ద రాష్ట్రంలో చిన్న కోడ‌లు చిచ్చు

దేశంలో అతిపెద్ద రాష్ట్రం యూపీలో రాజ‌కీయం క్లైమాక్స్‌కి చేరింది! ఎన్నిక‌ల ముంగిట్లో అధికార పార్టీ కుమ్ములాట‌ల‌తో కాల‌క్షేపం చేస్తోంది.మొన్నామ‌ధ్య సీఎం అఖిలేష్‌కి, ఆయ‌న బాబాయి.

 She Is The Reason Behind Samajwadi Party Allegations..?-TeluguStop.com

రాష్ట్ర మంత్రి శివ‌పాల్ యాద‌వ్‌ల మ‌ధ్య రేగిన వివాదం చిలికి చిలికి గాలివాన‌గా మార‌డం తెలిసింది.ఈ స‌మ‌యంలో రంగంలోకి దిగిన ఎస్‌పీ సుప్రీమో.

నేతాజీ.ములాయం సింగ్ యాద‌వ్‌.

ఇరు ప‌క్షాలూ రెండు క‌ళ్లంటూ ప్ర‌క‌టించ‌డంతో అంతా స‌ర్దు బాటు అయిపోయింద‌ని అనుకున్నారు.కానీ, ఇప్పుడు మ‌రోసారి యూపీ పాలిటిక్స్ ఒక్క‌సారిగా దేశం దృష్టిని ఆక‌ర్షించాయి.

వ‌చ్చే రెండు నెల‌ల్లో.యూపీలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఈ నేప‌థ్యంలో అభ్య‌ర్థ‌లు ఎంపిక బాధ్య‌త‌ను స్వీక‌రించిన సీఎం అఖిలేష్‌.కేంద్రంగా మ‌రోసారి వివాదం పీక్ స్థాయికి చేరింది.మొత్తం 403 స్థానాలున్న యూపీ అసెంబ్లీకి ఇప్ప‌టికే అఖిలేష్‌.325 మంది పేర్ల‌తో జాబితా కూడా సిద్ధం చేశాడు.ఈ జాబితానే ఇప్ప‌డు ఆయ‌న‌ను పార్టీకి దూరం చేసింది.అంతేకాకుండా ఆరు సంవ‌త్స‌రాల‌పాటు పార్టీ నుంచి స‌స్పెండ్ చేసే ప‌రిస్థితికి దారి తీసింది.ఈ త‌తంగం వెనుక పెద్ద ఎత్తున ములాయం చిన్న‌కోడ‌లు చ‌క్రం తిప్పింద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.ఆమెకి, సీఎం అఖిలేష్‌కి మ‌ధ్య దూరం పెర‌గ‌డం.

ఆమె పేరును క‌నీసం ప‌రిశీల‌నా జాబితాలో కూడా చేర్చ‌క‌పోవ‌డం తాజా వివాదానికి కార‌ణంగా క‌నిపిస్తోంది.

ఎస్పీ చీఫ్ ములాయం, ఆయ‌న రెండో భార్య‌ సాధనాగుప్తా తనయుడైన ప్రతీక్‌ సతీమణి అపర్ణ రాజ‌కీయం అరంగేట్రం చేయ‌డంతో పాటు .వీలైతే.నాలుగు మాట‌లు అన్న‌ట్టు కుదిరితే సీఎం సీటు కూడా ద‌క్కించుకోవాల‌ని భావించింద‌ట‌!! అంత‌టితో ఆగ‌కుండా ఎస్పీకి యువ వారసురాలిగా తానే తెరపైకి రావాలని ఆమె కలలు కంటోంద‌ని స్థానిక మీడియా పెన్నెత్తి కూస్తోంది.

ఈ నేప‌థ్యంలో రాష్ట్రంలోని కంటోన్మెంట్ స్థానం నుంచి ఎన్నిక‌ల బ‌రిలో దిగాల‌ని అప‌ర్ణ డిసైడ్ అయింది.అయితే, ఇప్ప‌టికే రూపొందించేసిన ఎస్పీ అభ్య‌ర్థుల జాబితాలో ఆమె పేరు లేక‌పోవ‌డంతో హ‌తాశురాలై.

ఈ జాబితాను రూపొందించిన అఖిలేష్‌పై ప్ర‌తీకారానికి సిద్ధ‌మైంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి.

వాస్త‌వానికి కంటోన్మెంట్ స్థానంలో ఎస్పీకి అంత బ‌లం లేదు.

ఈ ప్లేస్ నుంచి కాంగ్రెస్ గెలుస్తోంది.అయినా కూడా అప‌ర్ణ ఈ ప్లేస్‌ను ఎంచుకోవ‌డం ద్వారా త‌న‌ను తాను నిరూపించుకోవ‌డంతోపాటు.

ఇప్ప‌టి వ‌ర‌కు గెలుపొంద‌ని స్థానం నుంచి గెలిచి మామ‌గారికి గిఫ్ట్ ఇవ్వాల‌ని ఆమె డిసైడ‌య్యార‌ట‌.ఈ క్ర‌మంలోనే గ‌త కొన్నాళ్లుగా ఆమె ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అఖిలేష్ త‌న ఎన్నిక‌ల జాబితాలో మ‌ర‌ద‌లు పేరు చేర్చ‌క‌పోవ‌డంతో సాధ‌న‌, ప్ర‌తీక్‌లు క‌లిసి.ఇప్పుడు ఈ దుమారానికి స్కెచ్ గీశార‌ని అంటున్నారు.

మొత్తానికి మ‌ర‌ద‌లు చేతిలో బావ‌గారు బాగానే షాక్ తిన్నార‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి.మ‌రి భ‌విష్య‌త్తులో ఏం జ‌రుగుతుందో చూడాలి .

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube