YCP MP Magunta Srinivasulu Reddy : ఎంపీ మాగుంట అలా డిసైడ్ అయిపోయరా ?

వైసిపి అధినేత, ఏపీ సీఎం జగన్( AP CM YS Jagan ) చేపట్టిన పార్టీ అభ్యర్థుల ప్రక్షాళన పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.తనకు అత్యంత సన్నిహితులైన వారిని, తన వెంట నడిచిన వారిని సైతం జగన్ పక్కన పెట్టడంతో, వారంతా అసంతృప్తితో రగిలిపోతున్నారు.

 Ap Ycp Mp Magunta Srinivasulu Reddy Wants To Change Party-TeluguStop.com

కష్టకాలంలో అన్ని విషయాల్లోనూ అండగా నిలిచామని, ఇప్పుడు సర్వేల పేరుతో తమను పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు.ఇప్పటికే కొంతమంది ఇతర పార్టీలో చేరిపోగా, మరి కొంత మంది ఎన్నికల సమయం నాటికి టికెట్ ఖరారు చేసుకుని ఇతర పార్టీల్లో చేరాలని చూస్తున్నారు.

ముఖ్యంగా టిడిపి, జనసేన పొత్తు( TDP Janasena Alliance ) పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో ఆ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీలో టికెట్ తెచ్చుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఖాయం అనే లెక్కల్లో కొంతమంది అసంతృప్త నేతలు ఉన్నారు.

Telugu Ap, Janasena, Ys Jagan-Politics

ఇక తాజాగా ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి( YCP MP Magunta Srinivasulu Reddy ) పార్టీ మారే ఆలోచనతో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.ఆయనకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చే విషయంలో తర్జభర్జన జరుగుతుండడంతో ఆయన ఇంకా తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.ఆయనకు ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivas Reddy ) జగన్ వద్ద రాయభారం చేసినా, మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు జగన్ ఇష్టపడడం లేదట.

దీనికి కారణం మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ ఢిల్లీ లిక్కర్ స్కాం( Liquor Scam ) అనేక ఆరోపణలు ఎదుర్కోవడం, మాగుంట శ్రీనివాస్ రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి జైలులో ఉండి బయటకు రావడంతో ఈసారి మాగుంట కుటుంబానికి టికెట్ ఇవ్వకూడదని ఆలోచనతో జగన్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది.

Telugu Ap, Janasena, Ys Jagan-Politics

అయితే కేసులు ఉన్నంత మాత్రాన టికెట్ నిరాకరించడం ఎంతవరకు కరెక్ట్ అని, పార్టీలో ఏ నేతపై కేసులు లేవని మాగుంట అనుచరులు ప్రశ్నిస్తున్నారు.అయితే జగన్ చిన్నాన్న వై వి సుబ్బారెడ్డి( YV Subba Reddy ) మాగుంటకు టికెట్ రాకుండా అడ్డుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.పార్టీ మారే విషయంలో మాగుంట ఇంకా ఏ నిర్ణయం తీసుకోనప్పటికీ ఆయన పార్టీ మారతారనే ప్రచారం మాత్రం మొదలైంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube